కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపు నడిపే కుట్ర: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 1, 2021, 7:57 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం నీళ్ల పేరుతో లేని పంచాయతీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం రోజుకు 11 టీఎంసీల నీరు తరలించేందుకు ప్లాన్ చేశారని రేవంత్ మండిపడ్డారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం నీళ్ల పేరుతో లేని పంచాయతీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం రోజుకు 11 టీఎంసీల నీరు తరలించేందుకు ప్లాన్ చేశారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో అన్ని ప్రాజెక్ట్‌లకు కలిపి ఒక టీఎంసీ వాడుకోగలమని ఆయన అన్నారు. తెలంగాణలో ఏం చెప్పుకుని షర్మిల పార్టీ పెడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ కోడలు షర్మిలకు నీళ్ల దోపిడీ కనపడదా అని ఆయన నిలదీశారు. నీళ్ల దోపిడిలో వైఎస్, జగన్ హస్తం వుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపే నడిపేందుకు డ్రామా నడుస్తోందని ఆయన అన్నారు. వైఎస్‌ను తిట్టడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అని రేవంత్ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ తరపున గెలిచినవాడినని.. షర్మిల రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALso Read:తెలంగాణ వాటాఒక్క చుక్క నీటిని కూడ వదులుకోం: వైఎస్ షర్మిల

కాగా, ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అంటూ నిన్న ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు. పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా వారియర్స్ కూడా అంతే ముఖ్యమన్నారు షర్మిల. జులై 8న కొత్త పార్టీ ప్రకటన ఉంటుంద‌న్నారు. విద్య, వైద్యం ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాలన్న‌దే త‌న ధ్యేయ‌మ‌న్నారు. అన్ని కులాలు, మ‌తాల‌కీ అతీతంగా పార్టీ ఉంటుంద‌ని చెప్పారు

click me!