హైకోర్టు ఆదేశం: మేఘమథనం బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ అంగీకారం

By Siva KodatiFirst Published Jul 1, 2021, 7:15 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మేఘమథనం బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 2007 నుంచి 2009 మధ్యకాలంలో మేఘమథనం కార్యక్రమానికి సంబంధించి బెంగళూరుకు చెందిన అగ్ని ఏవియేషన్‌‌కు బకాయిలు చెల్లించలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మేఘమథనం బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 2007 నుంచి 2009 మధ్యకాలంలో మేఘమథనం కార్యక్రమానికి సంబంధించి బెంగళూరుకు చెందిన అగ్ని ఏవియేషన్‌‌కు బకాయిలు చెల్లించలేదు. దీనిపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో 9 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏపీ, తెలంగాణలు 58: 42 నిష్పత్తితో బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బకాయిలు చెల్లింపుల కోసం ఇవాళ్టీ వరకు గడువిచ్చింది తెలంగాణ హైకోర్టు. బకాయిలు చెల్లించని పక్షంలో నెల రోజుల జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కాగా, అగ్ని ఏవియేషన్‌కు వడ్డీతో కలిపి రూ.35 కోట్లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 

click me!