ప్రభుత్వ భూముల అమ్మకం: వేలం ప్రక్రియపై హైకోర్టులో విజయశాంతి పిటిషన్

By Siva Kodati  |  First Published Jul 1, 2021, 7:39 PM IST

నిధుల సమీకరణలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వేలం ద్వారా భూములు విక్రయించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది


నిధుల సమీకరణలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వేలం ద్వారా భూములు విక్రయించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడేందుకు మరో ఉద్యమానికి దిగుతామని కాంగ్రెస్ హెచ్చరించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత విజయశాంతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. నిధుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని విజయశాంతి పేర్కొన్నారు.  

Also Read:కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు: పోలీసులకు హెచ్ఎండీఏ ఫిర్యాదు

Latest Videos

అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత దారుణంగా మరిందనే విషయం చెప్పడానికి గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలని ఆమె అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గేటుకి తాళిబొట్టు వేలాడదీసిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతు బీమా పరిహారం, రైతుబంధు అందలేదని రాములమ్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శివ్వంపేటలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు.
 

click me!