పైన షేర్వాణీ.. కింద ఖాకీ నిక్కర్, మోడీ ఫ్రెండ్‌కి పార్టీ ఇచ్చావా లేదా : ఒవైసీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 12, 2023, 8:35 PM IST

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా వుందని అనుకున్నానని.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ వుందని రేవంత్ వ్యాఖ్యానించారు.


ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా, భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తానని .. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు ఒవైసీ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా వుందని అనుకున్నానని.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ వుందని ఆయన వ్యాఖ్యానించారు.

ముస్లిం హక్కుల కోసం పోరాడేందుకు అసదుద్దీన్‌ను ఆయన తండ్రి బారిష్టర్ చదివిస్తే .. ఒవైసీ మాత్రం ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్ధతుగా వున్నారని దుయ్యబట్టారు. గోషామహాల్‌లో రాజాసింగ్‌పై ఎంఐఎం ఎందుకు అభ్యర్ధిని నిలబెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ లాంటి వారిని కాపాడేందుకు అసదుద్దీన్ ఒవైసీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. 

Latest Videos

ALso Read: గువ్వల బాలరాజు ఘటన డ్రామాయే .. ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వుంటే ఇవి కామన్ : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

అంతకుముందు బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గువ్వల బాలరాజును డ్రామారావు పరామర్శించి తమపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు . కుట్రలు జరుగుతున్నాయి కేటీఆర్ ఆరోపించారని రేవంత్ దుయ్యబట్టారు. బెంగాల్‌లో మమతా బెనర్జీపై దాడి జరగడంతో ఆమె వీల్ చైర్‌పై ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగినప్పుడు హరీశ్‌రావు బాగా నటించారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంతా పీసీసీ చీఫ్ ప్రేరేపితమని కల్వకుంట్ల కుటుంబం ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సేషన్ కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందని ఆ జిల్లా ఎస్పీ ప్రకటన చేశారని రేవంత్ తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కాంగ్రెస్ ప్రమేయం లేదని ఎస్పీనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఘటనలో ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వ్యూహకర్తగా వుంటే.. అక్కడ ఇలాంటి డ్రామాలు కామన్ అని రేవంత్ ఆరోపించారు. మరో 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు కుట్ర వుందని మొదట చెప్పి.. తర్వాత కేంద్ర అధికారులు నిర్వహణ లోపం అంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. 

click me!