జీవో నెం 317.. ఉపాధ్యాయులపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం, జోక్యం చేసుకోండి: కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : Feb 10, 2022, 02:55 PM IST
జీవో నెం 317.. ఉపాధ్యాయులపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం, జోక్యం చేసుకోండి: కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) జారీ చేసిన జీవో 317పై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ (tpcc) ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఆ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) జారీ చేసిన జీవో 317పై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు టీపీసీసీ చీఫ్ (tpcc) ఎంపీ రేవంత్ రెడ్డి. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లకు అన్యాయం చేస్తున్న ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెచ్చిన ఆ జీవోతో ఉపాధ్యాయులంతా కన్నతల్లి, జన్మభూమికి దూరమై క్షోభ అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తెలంగాణలో జీవో నెంబర్ 317కు (GO 317) వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ బదిలీపై తీవ్ర మనస్థాపం చెందిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. జైత్రం నాయక్ కుటుంబాన్ని నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. జీవో 317 కు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక్షస పాలన నడుస్తుందని అన్నారు. జీవో నెం.317ని వెంటే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోనూ (parliament) దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు.

‘కేసీఆర్ ఓట్లేసిన ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకుని పరిపాలన చేస్తున్నారు. న్యాయం కోసం అడిగేవాళ్లను పోలీసుల చేత నిర్భంధించి, ఒత్తిడి చేసి సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల పిల్లలు ఈ రోజు ఎక్కడుండాలో, వాళ్ల స్థానికత ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. సమస్యను జఠిలం చేసి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తుంది. దీనిని క్షమించకూడదు. ఈ అంశాన్ని రాష్ట్రంలో శాసనసభలో, కేంద్రంలో పార్లమెంట్‌లో తమ పార్టీ ప్రశ్నిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేసి వ్యవహరిస్తున్నాయి’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్