తెలంగాణలో కల్వకుంట్ల చట్టం...అందువల్లే వంటేరు అరెస్ట్: ఉత్తమ్

By Arun Kumar PFirst Published Nov 27, 2018, 3:13 PM IST
Highlights

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆన్ఎస్ పీఫుల్స్ ప్రంట్ అభ్యర్థులను బెదిరించడానికి ప్రయత్నిస్తోందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.మరీ ముఖ్యంగా గజ్వెల్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పోలీసుల సాయంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా, ఎక్కడినుండైనా, ఎవరిపైనైనా పోటీ చేయడానికి అర్హులని అన్నారు. కానీ తనపై పోటీచేస్తున్న అభ్యర్థిని బెదిరిస్తూ భయానక వాతావరణం సృష్టించడం తగదన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా...? లేక కల్వకుంట్ల చట్టం అమల్లో ఉందా...?  అంటూ ప్రశ్న ఉత్తమ్ ప్రశ్నించారు. 

గజ్వేల్ పీఫుల్స్ ప్రంట్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని ఇవాళ మేడ్చల్‌ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ పై స్పందించిన ఉత్తమ్...ఎన్నికల సంఘం తమ విధులను నిస్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.  

గత మూడు రోజుల నుండి వంటేరు చుట్టే గజ్వేల్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేయడం, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత మేడ్చల్ లోని అతడి ఇంట్లో సోమవారం అర్థరాత్రి  సోదాలు నిర్వహించేందుకు  పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, అనుచరులు అడ్డుకోవడం...వంటేరు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు వెనుదిరిగారు. 

మళ్లీ ఇవాళ ఉదయం ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో వంటేరు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

మరిన్ని వార్తలు

వంటేరు ఇంటి వద్ద హైడ్రామా.. అరెస్ట్

ఇంట్లో పోలీసుల సోదాలు.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

ఈసీతో వంటేరు సమావేశం...కేసీఆర్ ఫాంహౌస్‌పై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స

వంటేరు దీక్షను భగ్నం చేసిన పోలీసులు (వీడియో)

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు

click me!