నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే

By Nagaraju TFirst Published Nov 27, 2018, 2:49 PM IST
Highlights

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటికే అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న సుహాసినికి అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. అదేలా అనుకుంటున్నారా...టీఆర్ఎస్ మాజీనేత గొట్టిముక్కల పద్మారావు రూపంలో. 
 

కూకట్‌పల్లి: కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటికే అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న సుహాసినికి అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. అదేలా అనుకుంటున్నారా...టీఆర్ఎస్ మాజీనేత గొట్టిముక్కల పద్మారావు రూపంలో. 

గొట్టిముక్కల పద్మారావు కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు బలమైన నేత. కూకట్ పల్లి టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అయితే గొట్టిముక్కల పద్మారావు ఏ పార్టీలో చేరబోతున్నారా అంటూ చర్చ జరుగుతుంది. అయితే అనూహ్యంగా ఆయన టీడీపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. 

అందులో భాగంగా విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. బుధవారం నుంచి నందమూరి సుహాసిని గెలుపు కోసం గొట్టిముక్కల ప్రచారం చేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీని తన ఇల్లులా, కేసీఆర్‌ను తన తండ్రిలా భావించానని గొట్టిముక్కల వ్యాఖ్యానించారు. 

తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా మార్పుకోసం ఎదురుచూశానన్నారు. కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని, పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని భావించి తన క్రియాశీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పలువురు టీఆర్ఎస్ పార్టీని వీడారు. తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మారడం టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బేనని చెప్పుకోవాలి. ఇకపోతే  గొట్టిముక్కల పద్మారావు పార్టీ వీడటం, టీడీపీలో చేరడం, బుధవారం నుంచే ప్రజాఫ్రంట్ టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానని చెప్పడం వరుస పరిణామాలతో నందమూరి సుహాసిని శిబిరం సంబరపడిపోతుంది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కూకట్ పల్లిలో టీఆర్ఎస్ కు షాక్: కీలక నేత రాజీనామా

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎన్నికల షెడ్యూల్ ఖరారు

నందమూరి సుహాసినికి చిక్కులు: ఓటమికి రంగంలోకి వైఎస్ జగన్

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)

ఘర్షణ: సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

 

click me!