
టమాటా ధరలు దిగిరావడం లేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మన రాష్ట్రంలోనూ వాటి ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. హైదరాబాద్ లో రిటైల్ మార్కెట్ లో కూడా మంచి నాణ్యత కలిగిన టమాటా ధర మంగళవారం రూ.200లకు చేరుకుంది. హోల్ సేల్ మార్కెట్ లోనే కిలోకు 150 రూపాయలకు లభించడంతో చిరు వ్యాపారులు వాటిని రూ.200లకు విక్రయించారు. అయితే ప్రసిద్ధి చెందిన మందనపల్లె రకం టమోటాలకు కిలోకు రూ.200 చొప్పున కొనేందుకు వినియోగదారులు బారులు తీరారు.
మృత్యుంజయుడు.. థానే ప్రమాదంలో 115 అడుగుల ఎత్తులో నుంచి పడినా.. గాయాలతో బయటపడ్డ కార్మికుడు
బోయినపల్లి కూరగాయల మార్కెట్ కు మందనపల్లి, అనంతపురం రకాలకు చెందిన 1,300 క్వింటాళ్ల టమోటాలు రాగా, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి 29 క్వింటాళ్ల స్థానిక రకం టమోటాలు మాత్రమే వచ్చాయి. మదనపల్లె టమాటాను ఒక బాక్స్ రూ.3,500 రూపాయలకు విక్రయించామని, అయితే స్థానిక, రిటైల్ మార్కెట్లలో కిలో రూ.200 వరకు ధరలు పెరిగాయని స్థానిక కమీషన్ ఏజెంట్ ఎ.శ్రీనివాస్ ‘టైమ్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇతర టమోటా రకాల ధరలు కూడా కిలోకు 180 వరకు పలికాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రత నమోదు
ధరలు ఎలా ఉన్నప్పటికీ అధిక నాణ్యత కలిగిన టమాటాల సరఫరా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లోని రిటైల్ షాపుల్లో మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని మార్కెట్ లోని చిరు వ్యాపారులు, అలాగే తక్కువ సంఖ్యలో రిటైల్ షాపులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి నాణ్యమైన టమాటాలను కొనుగోలు చేస్తున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన టీఎస్‌పీఎస్సీ..
మరో 10 రోజుల్లో అనంతపురం నుంచి టమాటాల సరఫరా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే మార్కెట్లకు లోకల్ రకం టమాటాల సరఫరా పెరిగితే వినియోగదారులకు కిలోకు రూ.50కి మాత్రమే లభిస్తాయని పేర్కొంటున్నారు. కాగా., టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో చాలా ఇళ్లలో టమోటా వినియోగం తగ్గింది. అధికంగా ధరలు ఉండటం వల్ల ఆ కూరగాయను కొనేందుకు సాధారణ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు.