టాలీవుడ్ డ్రగ్స్ కేసు: అఫ్రూవర్ గా మారిన కెల్విన్, కీలక సమాచారం సేకరించిన ఈడీ

By narsimha lodeFirst Published Sep 1, 2021, 12:37 PM IST
Highlights

ఈడీ ముందు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో   నిందితుడు కెల్విన్ లొంగిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ అధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు పంపారు.  సినీ ప్రముఖుల నుండి కెల్విన్ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్:టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఈడీ అధికారుల ముందు లొంగిపోయాడు. కెల్విన్ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ఈడీ అధికారులకు కెల్విన్ అఫ్రూవర్ గా మారిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా  ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరీ విచారణలో కీలక విషయాలు.. తెరపైకి ముగ్గురు ఆఫ్రికన్ల పేర్లు

కెల్విన్ బ్యాంకు ఖాతాకు టాలీవుడ్ కు చెందిన సినీతారల నుండి డబ్బులు జమ చేసినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై నోటీసులు అందుకొన్న సినీతారలను 2015 నుండి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకురావాలని కోరారు. నిన్న విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్   విచారణ సమయంలో బ్యాంకు స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులకు సమర్పించారు. 10 గంటల పాటు పూరీ జగన్నాథ్ ను ఈడీ ప్రశ్నించింది.

సెప్టెంబర్‌ 2న నటి చార్మీ, సెప్టెంబర్‌ 6న హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్‌ 8న మరో స్టార్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి, సెప్టెంబర్‌ 9న మరో హీరో రవితేజా, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్‌ 13వ తేదీన నటుడు నవదీప్‌, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్‌ 15వ తేదీనా ముమైఖాన్‌, సెప్టెంబర్‌ 17వ తేదీన నటుడు తనీష్‌, సెప్టెంబర్‌ 20న హీరో నందు, సెప్టెంబర్‌ 22న హీరో తరుణ్‌ను ఈడీ విచారించనుంది.
 

 

click me!