నా కారుపై దాడి: హైద్రాబాద్ గచ్చిబౌలి పోలీసులకు నరేష్ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Feb 19, 2023, 2:51 PM IST

హైద్రాబాద్ గచ్చిబౌలి పోలీసులకు  సినీ నటుడు  నరేష్  ఇవాళ   ఫిర్యాదు  చేశారు. తన  కారుపై  దుండగులు  దాడి  చేశారని  ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు.  


హైదరాబాద్:  నగరంలోని  తన నివాసం  ముందు  పార్క్  చేసిన  కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి   చేశారని  సినీ నటుడు  నరేష్  గచ్చిబౌలి పోలీసులకు  ఆదివారం నాడు ఫిర్యాదు చేశాడు. 

హైద్రాబాద్ లో తన  నివాసం ముందు  పార్క్  చేసిన కారుపై  దాడి జరిగిందని  నరేష్  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు  తన ఇంటిపై కూడా  దుండగులు దాడి చేశారని ఆయన ఈ ఫిర్యాదులో  పేర్కొన్నారు.  తన మూడో  భార్య  రమ్య రఘుపతిపై  నరేష్ అనుమానం వ్యక్తం  చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  గచ్చిబౌలి పోలీసులు  విచారణ చేస్తున్నారు. నరేష్  ఇంటి వద్ద  ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. 

Latest Videos

సినీ నటుడు  నరేష్  తన మూడో భార్య   రమ్య రఘుపతిపై  ఈ ఏడాది జనవరి  27వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రమ్య రఘుపతి వద్ద ఉంటే తన కొడుకు  భవిష్యత్తు  నాశనం అవుతుందని  ఆయన ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  ఆస్తి కోసం  తనను  చంపించేందుకు  రమ్య రఘుపతి  ప్రయత్నించిందదని  కూడ  నరేష్  హైద్రాబాద్  పోలీసులకు  ఫిర్యాదు  చేసిన విషయం తెలిసిందే. 

also read:ఆస్తి కోసం నన్నే చంపాలనుకుంది.. నా కొడుకు రమ్య దగ్గరొద్దు : కోర్టులో నరేష్ పిటిషన్

2022 ఏప్రిల్ మాసంలో  తన ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించారని కూడా  ఆయన  ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు. 2010 మార్చి 3న రమ్యను బెంగుళూరులో  వివాహం  చేసుకున్నాడు, సినీ నటుడు నరేష్ . తన పేరు చెప్పి రమ్య రఘుపతి  అప్పులు  చేసిందని నరేష్ ఆరోపిస్తున్నారు.  తనకు  విడాకులు ఇవ్వాలని  నరేష్ రమ్య రఘుపతిని కోరుతున్నారు. అయితే  విడాకులు  ఇచ్చేందుకు  రమ్య రఘుపతి నిరాకరిస్తున్నారని  సమాచారం.  ఇటీవల బెంగుళూరులోని హోటల్ లో  నరేష్, పవిత్ర లోకేష్ లు  ఉన్న సమయంలో రమ్య రఘుపతి  దాడికి ప్రయత్నించిన  విషయం తెలిసిందే. 

మూడో భార్య  రమ్య రఘుపతిపై  టాలీవుడ్  నటుడు నరేష్  ఇటీవల  కాలంలో  తీవ్ర  విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా వేదికగా  నరేష్  రమ్య రఘుపతి పై ఆరోపణలు చేశారు. అంతేకాదు   తన ఆరోపణలకు సంబంధించి  ఆధారాలతో పోలీసులకు కూడా ఆయన  ఫిర్యాదు  చేశారు.  

 

click me!