మంచిర్యాలలో విషాదం:పెద్దలు అంగీకరించినా ప్రేమ జంట సూసైడ్, ఎందుకంటే?

By narsimha lode  |  First Published Feb 19, 2023, 1:21 PM IST

మంచిర్యాల జిల్లాలో  ప్రేమ జంట  ఆత్మహత్య  చేసుకుంది.  ప్రేమకు  పెద్దలు అంగీకరించినా  ప్రేమ జంట  ఆత్మహత్య  చేసుకుంది.  


మంచిర్యాల:  జిల్లాలోని  హజీపూర్ మండలం  దొనబండలో  ఆదివారం నాడు ప్రేమ జంట  ఆత్మహత్య  చేసుకుంది. శ్రీకాంత్, సంఘవిలు  గత కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు.  వీరిద్దరి  ప్రేమకు ఇరువైపుల కుటుంబసభ్యులు  అంగీకరించారు.  అయితే  ఆర్ధిక ఇబ్బందుల కారణంగా  శ్రీకాంత్  పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం  చేశాడు.  ఈ విషయం తెలిసిన  ప్రియురాలు సంఘవి  కూడా  ఆత్మహత్యాయత్నం  చేసింది. వీరిద్దరిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో  చేర్పించారు . ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  వీరిద్దరూ    ఇవాళమృతి చెందారు. 

ప్రేమికుల జంటలు  ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కువగా  నమోదౌతున్నాయి.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని నార్సింగిలో ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది.  మతాలు వేరు కావడంతో  చెరువులో  దూకి  ఆత్మహత్య  చేసుకున్నారు. మెదక్ జిల్లా కు చెందిన  కల్పన, ఖలీల్  ప్రేమించుకున్నారు.  రెండు మాసాల క్రితమే  కల్పనకు  వివాహమైంది.   పుట్టింటికి వచ్చిన  కల్పన  ప్రియుడితో  వెళ్లి  ఆత్మహత్య  చేసుకుంది. నార్సింగి చెరువు నుండి  వెలికి తీశారు. 

Latest Videos

గత  ఏడాది డిసెంబర్  25న  నారాయణపేట జిల్లాలో  ఏపీ రాష్ట్రానికి  చెందిన ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది.  కర్నూల్  జిల్లా  ఎమ్మిగనూరు మండలం కందనూరు గ్రామానికి  చెందిన  ప్రేమ జంట  ఆత్మహత్య  చేసుకుంది.  నారాయణపేట జిల్లాలోని  చేగుంట  రైల్వే స్టేషన్  సమీపంలో  ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. 2022 నవంబర్  9వ తేదీన  యాదగిరిగుట్ట మండలం  బాహుపేటలో  ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది. ప్రియుడితో  వెళ్లి ఆమె  ఆత్మహత్య  చేసుకుంది. 

 ఏపీ  రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అదృశ్యమైన ప్రేమ జంట  హైద్రాబాద్ లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన 2022  మే  17న చోటు  చేసుకుంది. ఈ ఘటనలో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందింది

also read:నార్సింగిలో విషాదం: సూసైడ్ చేసుకున్న ప్రేమ జంట

2022  నవంబర్  8వ తేదీన ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది. సుబ్బారావు, తేజలు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి  పెద్దలు అంగీకరించరనే కారణంగా  వీరిద్దరూ  సూసైడ్  చేసుకున్నారు. 2022 నవంబర్ 8న  తిరుపతిలో  ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివాహిత  ప్రియుడితో కలిసి  తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.   


 

click me!