సూర్యాపేట జిల్లాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 3.2 గా తీవ్రత నమోదు

Published : Feb 19, 2023, 10:46 AM ISTUpdated : Feb 19, 2023, 11:23 AM IST
సూర్యాపేట జిల్లాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై  3.2 గా తీవ్రత నమోదు

సారాంశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని  పలు  ప్రాంతాల్లో  ఇవాళ భూకంపం  చోటు  చేసుకుంది.  పులిచింతల పరివాహక ప్రాంతాల్లో  భూమి కంపించింది.  

హుజూర్ నగర్:  సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో  ఆదివారం నాడు భూకంపం  వచ్చింది.  పులిచింతల ప్రాజెక్టుకు  సమీపంలోని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  భూకంపం  వచ్చిందని  అధికారులు  తెలిపారు.  

also read:పులిచింతల వద్ద వణికిస్తున్న వరుస భూకంపాలు: భయాందోళనలో స్థానికులు

సూర్యాపేట జిల్లాలోని  చింతలపాలెం, మేళ్లచెర్వు,  హుజూర్‌నగర్‌లలో   భూకంపం  వచ్చింది.   రిక్టర్ స్కేల్ పై 3.2   గా భూకంప తీవ్రత నమోదైంది. గతంలో  కూడా  ఇదే తరహలో  భూకంపం  వచ్చింది.  పులిచింతల ప్రాజెక్టుకు  సమీపంలోని  ప్రాంతాల్లో  భూప్రకంపనాలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలంతో పాటు  ప్రాజెక్టుకు  సమీపంలోని గ్రామాల్లో  భూకంపాలు  తరచుగా  వస్తున్నాయి.  ప్రాజెక్టుకు  సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూడ భూకంపాలు  వస్తున్నాయి.  దీంతో  ప్రాజెక్టుకు  సమీపంలోని  రెండు రాష్ట్రాల  ప్రజలు ఆందోళనగా ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!