నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Dec 27, 2021, 7:10 AM IST
Highlights

మొదట కార్యక్రమాన్ని Indira Park వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ Tarun Chugh, జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారు.

హైదరాబాద్ :  రాష్ట్రంలో government jobs భర్తీకి వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 
Bundi Sanjay నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. మొదట కార్యక్రమాన్ని Indira Park వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ Tarun Chugh, జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారు.

అభ్యంతరం ఎందుకు..
తాము చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలి వస్తున్న Student, job unionsనాయకులు, పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. Corona rulesకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన చేపడుతున్న దీక్షకు రాజకీయాలకు అతీతంగా  మద్దతు ఇవ్వాలని ప్రజాస్వామికవాదులను  కోరారు.

నిరుద్యోగ దీక్ష భగ్నం చేయాలన్న ఉద్దేశంతో ఇందిరాపార్కు వద్ద అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల  ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డిలు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడిస్తారో స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ కు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ లేఖ రాశారు. 

Bandi Sanjay: కేసీఆర్‌ నియంత పాలనకు నిదర్శన‌మిది.. ప్ర‌భుత్వంపై బండి సంజయ్ ఫైర్

కాగా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు ఆదివారం పిలుపునిచ్చారు. అయితే, ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీక్ష‌కు అడ్డంకులు సృష్టిస్తున్నదంటూ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. క‌రోనా వైర‌స్  నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న‌డుచుకుంటున్న తీరును ఆయ‌న ఖండించారున ఈ నేప‌థ్యంలోనే ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ట్విట్ట‌ర్ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఖండిస్తూ.. ‘‘నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు.  ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్‌ నియంత, అహంకార పాలనకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉద్యో్గాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌ కళ్లకు కనిపించడం లేదు. 

ఉద్యోగం, ఉపాధి కరవై లక్షలాది మంది యువత అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాలి. నిరోద్యగ యువతీ, యువకుల పక్షాన భాజపా చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరుతున్నా’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

click me!