అన్నను చంపి.. తల్లి పక్కకు చేరి నిద్రపోయాడు.. తెల్లారి లేచేసరికి..

Published : Dec 27, 2021, 06:41 AM IST
అన్నను చంపి.. తల్లి పక్కకు చేరి నిద్రపోయాడు.. తెల్లారి లేచేసరికి..

సారాంశం

శుక్రవారం రాత్రి అన్న భరత్ తో ఘర్షణ పడిన తమ్ముడు. వంటింట్లోని కుక్కర్ తీసుకుని బలంగా కొట్టడంతో అన్న అక్కడికక్కడే కిందపడిపోయాడు. తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నేల మీద పడుకుని అలాగే నిద్రపోయాడు. ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో తల్లి మూగగా రోధిస్తూనే ఉంది.

దుండిగల్ : Paralysisతో ఓ తల్లి మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరు కుమారులు (drunken brothers) తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలోని ఆమె వారిని వారించలేకపోయింది. ఈ fightingలో పెద్ద కుమారుడు dead అయ్యాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక కొడుకు deadbody పక్కనే జీవచ్ఛవంలా కొన్ని గంటల పాటు ఆమె మౌనంగా రోదించింది. ఈ హృదయవిదారకమైన ఘటన హైదరాబాద్ శివారు దుండిగల్ లో జరిగింది.

సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. విశాఖ పట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మి దంపతులు. చాన్నాళ్ల క్రితం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. వీరికి భరత్ (35), సాయితేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పనిచేసిన శ్రీమన్నారాయణ కొద్దికాలం క్రితం చనిపోయాడు. వరలక్ష్మి పదేళ్లుగా పక్షవాతంతో మంచాన పడింది. ఇద్దరు కుమారులు జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తరచూ గొడవ పడేవారు. 

శుక్రవారం రాత్రి అన్న భరత్ తో ఘర్షణ పడిన తమ్ముడు. వంటింట్లోని కుక్కర్ తీసుకుని బలంగా కొట్టడంతో అన్న అక్కడికక్కడే కిందపడిపోయాడు. తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నేల మీద పడుకుని అలాగే నిద్రపోయాడు. ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో తల్లి మూగగా రోధిస్తూనే ఉంది.

శనివారం ఉదయం చూసేసరికి అన్న చనిపోయి ఉండడంతో భయంతో తమ్ముడు ఇంట్లోంచి పారిపోయాడు. తర్వాత సాయంత్రం ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగులోని వచ్చింది. తల్లి కదల్లేని పరిస్థితుల్లో ఉండడంతో భరత్ కు అంత్యక్రియలు నిర్వహించేవారు లేక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త .. తట్టుకోలేక కొడుకుపై పెట్రోల్ పోసి, తల్లి ఆత్మహత్య

ఇదిలా ఉండగా, మద్యం మత్తులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (moinabad) సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై (hyderabad bijapur highway) శనివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్​ సమీపంలోని తాజ్​ హోటల్​ వద్ద అర్ధరాత్రి చేవెళ్ల నుంచి హైదరాబాద్​ వెళ్తున్న కారు .. కనకమామిడి వైపు వెళ్తున్న ఓ స్కూటీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక (16), సౌమ్య, అక్షయ కిందపడిపోయారు.

ప్రేమిక అనే అమ్మాయి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ఇద్దరికి కూడా గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో (Hyderabad) మందుబాబులు (Drunk people) బీభత్సం సృష్టించారు. మందుబాబుల వల్ల జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నార్సింగ్ ఎంజీఐటీ వద్ద.. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు మృతిచెందారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న