జూన్ రెండున ఆత్మగౌరవ దీక్ష: టీజేఎస్ చీఫ్ కోదండరామ్

By narsimha lode  |  First Published May 18, 2022, 3:14 PM IST


జూన్ రెండున ఆత్మగౌరవ దీక్ష  చేస్తానని తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ చెప్పారు. ఇవాళ హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్: ఈ ఏడాది జూన్ రెండవ తేదీన ఆత్మగౌరవ దీక్ష  చేస్తానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు Kodandaram ప్రకటించారు. బుధవారం నాడు Hyderabad  లో కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. Telanganaను తానే తెచ్చినట్టుగా KCR  చరిత్రను వక్రీకరిస్తున్నారని కోదండరామ్ చెప్పారు.ఏపీ  రాష్ట్రంలోని గుత్తేదారులకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. కేసీఆర్ Andhra Pradeshపాలకులకు దళారీగా మారిపోయారన్నారు. తెలంగాణ వాదులను ఏకం చేయనున్నట్టుగా కోదండరామ్ చెప్పారు.

also read:ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్: టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్

Latest Videos

undefined

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని ప్రొఫెసర్‌ కోదండరాం  2021 .జూలై 29న ఆందోళన చేశారు. హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలోనే కోదండరామ్  సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పన్నుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల డబ్బులు దోచుకుంటున్నాయని కోదండరామ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన అప్పట్లో హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోదండరామ్ 2017 నవంబర్ 1 ఇంట్లోనే దీక్ష చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ తో కోదండరామ్ మధ్య అగాధం పెరిగింది. దీంతో కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను కోదండరామ్ ప్రశ్నిస్తున్నారు. 

జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజునే  తెలంగాణ ఆత్మగౌరవ దీక్ష చేయాలని కోదండరామ్ నిర్ణయం తీసుకున్నారు.  కొంత కాలంగా టీజేఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇటీవలనే  కోదండరామ్ ఢిల్లీ పర్యటించారు.  ఆప్ లో విలీనం కోసమే కోదండరామ్ ఢిల్లీలో పర్యటించారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆప్ లో టీజేఎస్ విలీనం గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఈ వార్తలను టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కొట్టి పారేశారు. గతంలో కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనం అవుతుందని ప్రచారం జరిగిన విషయాన్ని  కోదండరామ్ గుర్తు చేస్తున్నారు.

click me!