పొగడక తప్పట్లేదు... సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు

Siva Kodati |  
Published : May 18, 2022, 02:59 PM ISTUpdated : May 18, 2022, 03:02 PM IST
పొగడక తప్పట్లేదు... సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పట్లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏ పార్టీ అయినా పని జరగాలంటే అందరి సహకారం కావాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) కాంగ్రెస్ (congress)ఎమ్మెల్యే, జగ్గారెడ్డి (jagga reddy) ప్రశంసలు కురిపించారు. సీఎంని పొగడక తప్పట్లేదన్నారు. కేసీఆర్ వచ్చి ఆసుపత్రి ప్రారంభించారని.. ఏ పార్టీ అయినా పని జరగాలంటే అందరి సహకారం కావాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇకపోతే.. సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై జగ్గారెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని.. గ్లామర్ అవుట్ అయిపోయిందని విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని.. సినిమా వాళ్లకు ఇదో తమాషా అయిపోందని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ గ్లామర్ అవుట్ అయిపోందని.. ఈజీగా రాజ్యసభ ఎక్కడ వస్తుందో అక్కడి చేరాడని అన్నారు. ప్రకాశ్ రాజ్.. ఒక్క రోజు కూడా పబ్లిక్‌లోకి వచ్చింది లేదన్నారు. ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఇదే ప్రకాష్ రాజు కేసీఆర్‌ను తిడుతారని.. ఆ రోజు వస్తుందన్నారు.  

ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్‌‌ను ఎన్నో ఏళ్లు కాంగ్రెస్‌ పాలించిందని.. ఒక్కసారి ఓడిపోయినంతా మాత్రాన పని అయిపోయిందని అనడం సరికాదన్నారు. రాహుల్ వరంగల్ సభ మెసేజ్ ప్రజల్లోకి పోవద్దని.. ఫస్ట్ పేజీల్లో అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చారని మండిపడ్డారు. ఇది టీఆర్ఎస్ చేతకానితనానికి నిదర్శనం అని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా పనికిరారని విమర్శించారు. ఢిల్లీ నుంచి స్ట్రిప్ట్ రాసిస్తే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చదువుతున్నాడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. 

రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పారు. రాహుల్ మెసేజ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని  చెప్పారు. ఇప్పుడు అనాల్సిందేనని.. జై తెలంగాణ కాదని.. జై రైతు అనాలి అన్నారు. ఇంకా రాజకీయం కోసం జై తెలంగాణ నినాదమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడూ సమైక్య ఆంధ్ర అన్న వ్యక్తులు నేడు కేసీఆర్ కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు.

ఇక, వరంగల్‌ రైతు సంఘర్షణ సభ గురించి ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. తెలంగాణను పాలిస్తుంది సీఎం కాదని.. ప్రజల మాట వినని రాజు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు ఎకరానికి రూ. 15,000 ఇస్తామని, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే రాహుల్ ట్వీట్‌పై స్పందించిన ప్రకాష్ రాజ్.. తెలంగాణకు దార్శనికుడైన కేసీఆర్ పరిపాలిస్తున్నారని, మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని విమర్శించారు.  #justasking అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!