డెక్కన్ స్టోర్ లో ముగ్గురు కార్మికులున్నట్టు అనుమానం: సెంట్రల్ జోన్ డీసీపీ

By narsimha lode  |  First Published Jan 20, 2023, 2:00 PM IST

సికింద్రాబాద్ డెక్కన్ నైట్ వేర్  స్టోర్  అగ్ని ప్రమాదం సమయంలో  ముగ్గురు కార్మికులు ఫస్ట్ ప్లోర్ లో  ఉన్నట్టుగా అనుమానిస్తున్నామని  సెంట్రల్ జోన్ డీసీపీ  చెప్పారు.  
 


హైదరాబాద్: డెక్కన్  నైట్ వేర్  స్టోర్స్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో  తొలుత మంటలు, పొగ వ్యాపించినట్టుగా  సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని  డెక్కన్ నైట్ వేర్  స్టోర్స్ భవనంలో అగ్ని ప్రమాదంపై  శుక్రవారంనాడు డీసీపీ  మీడియాతో మాట్లాడారు.  ఫస్ట్ ఫ్లోర్ లో  ఉన్న మెటీరియల్ ను  కిందకు తీసుకువచ్చేందుకు  కార్మికులు  ప్రయత్నించారన్నారు.ఈ  సమయంలో  మంటలు, పొగలు వ్యాప్తి చెందడంతో   భవన యజమాని  కార్మికులను భవనంపైకి పంపించారన్నారు.  అయితే  ఫస్ట్ ఫ్లోర్ లోనే ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారని  డీసీపీ అనుమానం వ్యక్తం  చేశారు. ఈ ముగ్గురు కార్మికుల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయన్నారు.  భవనంలోని మెట్ల మార్గం కుప్పకూలిందని  ఆయన  చెప్పారు. అగ్ని ప్రమాద ఘటనపై  కేసు నమోదు చేసినట్టుగా  డీసీపీ వివరించారు. 

also read:రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థత, భవనం కూల్చివేసే చాన్స్

Latest Videos

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్  భవనంలో  నిన్న ఉదయం 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంబవించింది.  ఈ భవనంలో  సింథటిక్, కార్ల టైర్ల వంటి  మెటీరియల్ ఉన్న కారణంగా మంటలు వేగంగా  వ్యాపించినట్టుగా  అగ్ని మాపక సిబ్బంది అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.  సుమారు  11 గంటలపాటు శ్రమించి ఫైర్ ఫైటర్లు  మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే  ఇవాళ ఉదయం కూడా  సెల్లార్ లో  ఇంకా  మంటలు వస్తున్నాయి.ఈ మంటలను ఆర్పేందుకు  ఫైర్ ఫైటర్లు  ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే  ఇవాళ ఉదయం ఇద్దరు  అగ్నిమాపక సిబ్బంది  అస్వస్థతకు  గురయ్యారు. ఈ భవనంలో  ఉన్న  మెటీరియల్ తగులబడడం  వల్ల  భారీగా పొగ వ్యాపించింది. ఈ పొగ సుమారు కిలోమీటరు దూరం వరకు  కన్పించింది. ఈ భవనం నుండి  పక్కనే ఉన్న పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటలను  అగ్నిమాపక సిబ్బంది  అదుపులోకి తెచ్చారు.   ఈ అగ్ని ప్రమాదం కారణంగా   ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను  ఈ భవనం పక్కనే ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న వారిని , ఖాళీ చేయించారు.  మరో వైపు  కాచీబౌలి కాలనీ వాసులను  కూడా  పోలీసులు ఖాళీ చేయించారు.

 


 

click me!