జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్లు రద్దు: తీర్మానం చేసిన మున్సిపల్ పాలకవర్గాలు

By narsimha lodeFirst Published Jan 20, 2023, 12:57 PM IST
Highlights

జగిత్యాల, కామారెడ్డి  మాస్టర్ ప్లాన్లను రద్దుచేస్తూ  ఈ రెండు మున్సిపల్  పాలకవర్గాలు ఇవాళ తీర్మానం చేశాయి.   మున్సిపల్ తీర్మానాల రద్దుతో  రైతులు ఆందోళనలను తాత్కాలికంగా విరమించారు. 

హైదరాబాద్: జగిత్యాల, కామారెడ్డి  మాస్టర్ ప్లాన్ ను  రద్దు  చేస్తూ  ఈ రెండు మున్సిపల్ పాలకవర్గాలు  ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి.  డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లను రద్దు  చేసేందుకు  ఈ రెండు మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నాడు సమావేశాలు నిర్వహించాయి.జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం  శుక్రవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేయాలని కోరుతూ రైతులు  ఆందోళనకు దిగుతున్నారు.దీంతో  ఇవాళ  జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  జగిత్యాల   డ్రాఫ్ట్ ప్లాన్  ను రద్దు చేస్తూ  మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది.   జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  గత కొన్ని రోజులుగా రైతులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  సంక్రాంతి  పర్వదినం తర్వాత  జగిత్యాల  మాస్టర్  ప్లాన్  ను నిరసిస్తూ  రైతులు  ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు.  

also read:జగిత్యాల మాస్టర్ ప్లాన్: రోడ్లను అష్ట దిగ్భంధనం చేసిన రైతులు

ఈ మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేశారు. ప్రతిపాదిత  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు.  మాస్టర్ ప్లాన్ రద్దుపై  స్పష్టమైన ప్రకటన చేయాలని  రైతులు డిమాండ్  చేశారు. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు  ఆందోళనకారులు ప్రయత్నించారు.  కానీ  పోలీసులు వారిని అడ్డుకున్నారు.  ఈ నెల  17న  జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించారు.  అదే రోజున జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ నివాసం ముందు మహిళా రైతులు ఆందోళన నిర్వహించారు.  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతుల ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో   ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయమై  నిన్న తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్,  జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ సంకేతాలు ఇచ్చారు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  రద్దు తీర్మానం

మరో వైపు కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  కామారెడ్డి  మున్సిపల్  కౌన్సిల్ సమావేశం ఇవాళ నిర్ణయం తీసుకుంది.  ఈ  విషయమై  మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా  నిర్వహించారు.   కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  విలీన గ్రామాలకు  చెందిన 9 మంది  కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని నిన్నటికి డెడ్ లైన్ విధించారు.  ఇద్దరు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు  రాజీనామాలు చేశారు. అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయలేదు.  అయితే ఈ తరుణంలో  ఇవాళ కామారెడ్డి మున్సిపల్ సమావేశం ఏర్పాటు  చేశారు. ఈ సమావేశంలో   కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  మున్సిపల్  పాలకవర్గం తీర్మానం చేసింది. 
 

click me!