పెళ్లైన నెల రోజులకే విషాదం: హైద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

By narsimha lodeFirst Published Nov 11, 2021, 9:44 AM IST
Highlights

హైద్రాబాద్ కు సమీపంలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పైడమ్మతో పాటు ఆమె కొడుకు, కూతురు చనిపోయారు.
 

హైదరాబాద్:హైద్రాబాద్ నగర శివారులోని దుండిగల్  జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు, కూతురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  పెళ్లైన నెల రోజులకే  ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి సమీపంలోని ఆర్తమూరుకు చెందిన శ్రీను, పైడమ్మ  దంపతులు జీవనోపాధి కోసం హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ నగరంలోని బహదూర్‌పల్లిలోని జేఎన్ఎన్‌యూఆర్ఎం ఫేజ్-2 బ్లాక్ 22లోని 14వ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు.

also read:రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం

 Paidamma దూలపల్లిలో ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. కొడుకు, కూతురులు దూలపల్లిలోని మరో పరిశ్రమలో పనిచేస్తున్నారు. ముగ్గురూ ప్రతి రోజూ ఒకే బైక్ పై పరిశ్రమలో విధులకు హాజరౌతారు. బుధవారం నాడు రాత్రి విధులు ముగించుకొని తల్లీ కొడుకు, కూతురు ఒకే బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో Accident చోటు చేసుకొంది.

DulapallYని అటవీ అకాడమీ సమీపంలో గల మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణీస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  పైడమ్మ నివాసం ఉంటున్న జేఎన్ఎన్‌యూఆర్ఎం నుండి దూలపల్లికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరమే. 10 నిమిషాల్లోనే  ఇంటికి చేరుకొంటారు. అయితే బుధవారం నాడు విధులు ముగించుకొని ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకొనేలోపుగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మరణించిన పైడమ్మ కొడుకు Kali Krishna కు నెల రోజుల క్రితమే పెళ్లైంది.  మచిలీపట్టణం సమీపంలోని బొర్రపోతులపాలెనికి చెందిన కోమలితో  నెల రోజుల క్రితమే వివాహమైంది.విధులు ముగించుకొని ఇంటికి వస్తాడని భర్త కోసం ఎదురుచూస్తున్న కోమలికి ఆయన మరణించాడనే విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. పెళ్లైన నెల రోజులకే భర్త మరణించడంతో ఆమె విషాదంలో మునిగిపోయింది.దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో రోడ్డు విస్తరణకు అటవీ శాఖ నుండి అనుమతులు రాని కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకొంది.

 రోడ్ల విస్తరణకు నోచుకోని కారణంగా ప్రమాదాలకు కారణమనే అభిప్రాయాలు చోటు చేసుకొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. 

 మరో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హైద్రాబాద్‌లోని కంచన్ బాగ్ ప్రాంతంలో మంగళవారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు.మృతుడు హపీజ్ బాబానగర్ కు చెందిన  అమీర్ గుర్తించారు.డీఆర్‌డీఓ జంక్షన్ వద్ద యువకుడు బైక్ పై మలుపు తీసుకొంటున్న సమయంలో  ఎదురుగా వచ్చిన మరో బైక్ అమీర్ బైక్ ను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఇద్దరు స్కూటరిస్టులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమీర్ మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. అమీర్ కు ఎదురుగా వచ్చిన బైకర్ గట్టిగా ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!