హరీష్ రెడ్డి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిన రాజశేఖర్ ను murder చేయాలని అనుకుని… స్నేహితుడు సింగసారం నాగరాజుతో కలిసి ప్రణాళిక రూపొందించాడు.
సిద్దిపేట : నంగునూరు మండలం లోని బద్దిపడగ శివారులో గతనెల 30న జరిగిన యువకుడి హత్య కేసును సిద్దిపేట, రాజ గోపాలపేట పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడని ఇద్దరు స్నేహితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేశారు. సిద్దిపేట రూరల్ సిఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…
హుస్నాబాద్ కు చెందిన గుర్రాల హరీష్ రెడ్డి అదే పట్టణానికి చెందిన యువతి నాలుగేళ్లుగా love చేసుకుంటున్నారు. వీరిద్దరి castలు వేరు కావడంతో పెళ్లి చేసుకునేందుకు యువకుడి తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టారు. దీంతో woman తల్లిదండ్రులు కోహెడ మండలం తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు.
undefined
విషయం తెలుసుకున్న హరీష్ రెడ్డి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిన రాజశేఖర్ ను murder చేయాలని అనుకుని… స్నేహితుడు సింగసారం నాగరాజుతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. car rentalకు నడుపుతూ జీవనం సాగిస్తున్న సదరు యువకుడి ఫోన్ నెంబర్ ను ప్రేమించిన యువతి నుంచి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు కారు కావాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు.
వారి సూచన మేరకు Rajasekhar అక్టోబర్ 29న తన తవేరా వాహనంలో కోహెడ మండలం ఆరేపల్లి కి వచ్చాడు. ముందస్తు ప్రణాళిక లో భాగంగా అప్పటికే హుస్నాబాద్ లో కత్తులు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు కొనుగోలు చేసిన హరీష్ రెడ్డి స్నేహితులు నాగరాజుతో కలిసి వాహనం ఎక్కారు. మరికొందరు నంగునూరు మండలం బద్దిపడగలో ఎక్కుతారు అని చెప్పగా రాజశేఖర్ అటు వైపు మళ్ళించాడు.
సిరిసిల్ల: తాళం వేసి వివాహానికి.. తిరిగొచ్చి చూస్తే అవాక్కు, పెళ్లికుమార్తె ఇంట్లో భారీ చోరీ
అక్కడ ఎవరూ లేకపోవడంతో రంగదాంపల్లి క్రాస్ రోడ్డుకు వెళ్లాలని చెప్పారు. మార్గ మధ్యలో చంపాలని భావించిన వీలు కాకపోవడంతో Airportకి వచ్చేవారు బద్దిపడగ లో ఉన్నారని చెప్పి వాహనాన్ని వెనక్కి మళ్లించారు. బద్దిపడగ శివారులో మూత్రవిసర్జన నిమిత్తం వాహనాన్ని ఆపాలని చెప్పి, రాజశేఖర్ ను దారుణంగా హతమార్చారు. తరువాత హరీష్ రెడ్డి తన స్నేహితుడు ఇల్లందుల శివకు ఫోన్ చేయగా అతను ద్విచక్రవాహనంపై వచ్చి ఇద్దరిని తీసుకొని
Husnabadకు చేరుకున్నారు.
మార్గమధ్యలో రాజశేఖర్ హత్యకు ఉపయోగించిన knifeలు వారితో పాటు ఉన్న సెల్ఫోన్లను బస్వాపూర్ వాగులో పడేశారు. ఈ నేపథ్యంలో ఆధ్వర్యంలో రాజ గోపాలపేట ఎస్సై మహిపాల్ రెడ్డి, పి ఎస్ ఐ తేజస్విని, సిద్దిపేట రూరల్ ఎస్సై శంకర్, ఎస్ హెచ్ ఓ గణేష్, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేశారు. టవేరా వాహనం నెంబరు ఆధారంగా మృతుని గుర్తించారు ఆ తర్వాత అతని సెల్ ఫోన్ కు వచ్చిన కాల్స్ ఆధారంగా హరీష్ రెడ్డితో పాటు నాగరాజు హంతకులుగా తేల్చారు.మంగళవారం హుస్నాబాద్ లో ఇంట్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు.