హైదరాబాద్ లో ముగ్గురు యువతులు అదృశ్యం.. పుట్టినరోజు వేడకుకలకు వెళ్లి...

Published : Feb 22, 2023, 11:24 AM IST
హైదరాబాద్ లో ముగ్గురు యువతులు అదృశ్యం.. పుట్టినరోజు వేడకుకలకు వెళ్లి...

సారాంశం

పుట్టినరోజు వేడుకలకని ఇంటినుంచి వెళ్లిన ముగ్గురు యువతులు కనిపించకుండా పోయారు. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన వారు తిరిగి రాలేదు. 

హైదరాబాద్ : ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ముగ్గురు పుట్టినరోజు వేడుకలకని బయటికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఇద్దరు యువతులు, ఓ బాలిక ఉన్నారు. సికింద్రాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. ఆమె ఇద్దరు స్నేహితులు అసీనా, అఖీనా అనే యువతులు. వీరిద్దరితో కలిసి నిన్న సాయంత్రం ఆ బాలిక పుట్టినరోజు వేడుకలకని బయటికి వెళ్లింది.

అలా వెళ్ళిన బాలిక రాత్రి అయిన కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు బాలిక స్నేహితులు, మిగతా బంధువుల ఇళ్లలో బాలిక గురించి ఆరా తీశారు. అయినా బాలిక ఆచూకీ లభించలేదు. ఆమెతో పాటు యువతులు కూడా కనిపించలేదు. దీంతో  తిరుమలగిరి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు వీరి కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.  కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్ కుషాయిగూడలోని ఆలయంలో చోరీకి యత్నం.. ఎదురుదాడిలో దొంగ మృతి..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జనవరి 24న ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలిలకలు అదృశ్యం అయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. జిల్లాలోని రాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఒకేసారి కనిపించకుండా పోయారు. దీనికి సంబంధంచిన వివరాలు ఇలా ఉన్నాయి.. విద్యార్థినులు జ్యోతి, నాగమణి, అంకిత గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. 

వీరు  రాపూరు, కలువాయి, పొదలకురు‌కు చెందినవారు. ఘటన జరిగిన రోజు హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు.. ఆ తరువాత తిరిగి హాస్టల్ కు రాలేదు. రాత్రి హాజరు తీసుకునే సమయంలో విద్యార్థినులు ముగ్గురు మిస్సింగ్ అయినట్లు సిబ్బంది గుర్తించారు.  ఇందుకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్