సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ లో ఇవాళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలనుఆర్పుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదౌతాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ ఆజంపురాలో గల టైర్ల గోడౌన్ లో ఈ నెల 19వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నెల 15న హైద్రాబాద్ పురానాపూర్ లో ని ఎయిర్ కూలర్ల గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది .హైద్రాబాద్ మైలార్ దేవ్ పల్లిలో గల టాటానగర్ లో కార్ల మెకానిక్ షెడ్ లో ఈ నెల 7వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది.
మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నెల 2వ తేదీన చిక్కడపల్లిలోని గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ లో ఈ ఏడాది జనవరి 19వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగాఈ భవనం మొత్తం దెబ్బతింది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం గాజువాక హెచ్ పీసీఎల్ లో ఈ నెల 13న అగ్ని ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పోతారం పారిశ్రామికవాడలో ఈ నెల అగ్ని ప్రమాదం జరిగింది. లియో ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి.