జీహెచ్‌ఎంసీ ఫింగర్ ప్రింట్స్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతం.. ముగ్గురు అరెస్ట్..

Published : Jul 14, 2022, 11:52 AM IST
జీహెచ్‌ఎంసీ ఫింగర్ ప్రింట్స్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతం.. ముగ్గురు అరెస్ట్..

సారాంశం

జీహెచ్‌ఎంసీలో చోటుచేసుకున్న సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి గోషామహల్ ఎస్‌ఎఫ్‌ఏ వెంకట్ రెడ్డితో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

జీహెచ్‌ఎంసీలో చోటుచేసుకున్న సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల సహకారంతో జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వింగ్ సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్‌ను చేధించిన సంగతి తెలిసిందే. గోషామహల్‌, మలక్‌పేట సర్కిళ్ల పరిధిలో ఈ స్కామ్ వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి గోషామహల్ ఎస్‌ఎఫ్‌ఏ వెంకట్ రెడ్డితో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారు చేశారని నిర్దారణకు వచ్చారు. 

ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్‌లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. మొత్తం 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అసలు సూత్రదారులను త్వరలోనే బయడపెడతామని పోలీసులు చెబుతున్నారు. 

‘‘శానిటేషన్ విభాగంలోని చాలా మంది కార్మికులు భౌతికంగా విధులకు హాజరుకాలేదు.. కానీ వారి హాజరు క్రమం తప్పకుండా గుర్తించబడుతోంది’’ అని ఒక అధికారి తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని ఇతర సర్కిల్‌లలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయో లేదో పరిశీలించాల్సి ఉందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?