భారీ వర్షాలతో పాటు గోదావరికి వరద పోటెత్తిన కాారణంగా మంచిర్యాలలో పలు కాలనీలు నీటిలో మునిగాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. మంచిర్యాలకు సమీపంలోని వాగుల నుండి వరద నీరు కాలనీలను ముంచెత్తుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాల: భారీ వర్షాలతో పాటు Godavari నదికి వరద పోటెత్తడంతో Mancherialలో పలు కాలనీలు నీటిలో మునిగాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Yellampalli ప్రాజెక్టు వద్ద 54 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 13 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్దుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 54 గేట్లు ఎత్తి 13.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాళ్లవాగు,తోళ్లవాగుల నుండి వరద నీరు మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలను ముంచెత్తాయి. వీటి కారణంగానే మరింత వరద పట్టణంలోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. వరద నీటిలోనే ఇళ్లు ఉండిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ,, రాం నగర్, పద్మశాలీ కాలనీ సహా పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి.
undefined
వరద నీరు ముంచెత్తడంతో మంచిర్యాల, నిజామాబాద్ మధ్య రాకపోకలునిలిచిపోయాయి. మరోవైపు మంచిర్యాల నిజామాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఉమ్మడి Adilabad జిల్లాల్లో దాదాపుగా వారం రోజులకు పైగా వర్షాలు ముంచెత్తాయి. గోదావరికి ఎగువన భారీ గా వరద వస్తుండడంతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాదు భారీ ప్రాజెక్టులతో పాటు అన్ని రకాల ప్రాజెక్టులు కూడా నీటీతో నిండిపోయాయి. భారీగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను మంగళవారం నాడు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వచ్చింది.ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీ మూడు లక్షలు మాత్రమ. అయితే దీంతో ఇరగేషన్ అధికారులు దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ఈ నీటిని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ లేకపోవడంతో మూడు చోట్ల ప్రాజెక్టుకు గండ్లు పడినట్టుగా అధికారులు గుర్తించారు.