రేవంత్ ను ‘అరే.. ఒరే’ అని పిలిచే ఏకైక మహిళా నేత

Published : Nov 06, 2017, 04:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రేవంత్ ను ‘అరే.. ఒరే’ అని పిలిచే ఏకైక మహిళా నేత

సారాంశం

కాంగ్రెస్ రేవంత్ ను అరే ఒరే అని పిలిచే ఏకైక నాయకురాలు పాలమూరు జిల్లా వాసులకు సుపరిచితమైన నాయకురాలు  

రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. రాజకీయ నాయకులు పైకి నిప్పులు కురిపించుకుంటారు. లోపల చిల్ అని చల్లచల్లగా ముచ్చట్లు చెప్పుకుంటారు. ఒకరినొకరు ఘాటుగా తిట్టుకుంటే వారిద్దరూ బద్ధ శత్రువులేమో అని మనం అనుకుంటాం. కానీ వారు పైకే అలా తిట్టుకుంటారు. లోపల స్నేహితులుగా ఉంటారు. ఒకే పార్టీలోని వారు పైకి మంచిగా ఉన్నట్లు నటిస్తారు. లోపల మస్తు తిట్టుకుంటారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఏ నాయకుడు ఏది చేసినా, ఏ నాయకుడు ఏం మాట్లాడినా... ఏ నాయకురాలు ఏం విమర్శలు చేసినా ఇవన్నీ రాజకీయాల్లో సహజం అని జనాలు నిట్టూరుస్తారు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.

అయితే ఇంకొందరి స్టయిల్ ఇంకో రకంగా ఉంటుంది. అవతలి నాయకుడు ఎంత తిడితే అంత పాపులారిటీ వస్తదని ఆరాటపడే వారు కూడా రాజకీయాల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. తనను తిట్టించుకోవడం కోసమే అవతలి వ్యక్తిని గిల్లి, రక్కి, తిట్టి, హింసించే వారు కూడా కొందరున్నారు. తీరా అవతివారు తిట్టగానే హమ్మయ్య ఇవాళ నా టార్గెట్ రీచ్ అయ్యానని సంబరపడేవారు ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రాజకీయాల్లో పైకి కనబడేవిధంగా అంతర్గతంగా ఉండదు అని చెప్పడానికి. పైన కత్తులు దూసుకున్నవారు లోపల దోస్తులుగా ఉంటారు. లోపల దోస్తులైనవారు బయట కత్తులు దూసుకుంటారు.

ఇది సరే కానీ.. అసలు విషయం చూద్దాం. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన పక్కన ఒక తెలంగాణ కీలక మహిళా నాయకురాలు ఉన్నారు. ఆమెకు రేవంత్ కు సంబంధం ఏంటని కదా మీ డౌట్? రేవంత్ రెడ్డిని అరే.. ఒరే అని పిలిచే నాయకురాలు ఈమెనే. బహుషా రాజకీయ మహిళా నేతల్లో రేవంత్ రెడ్డిని అరే, ఒరే అని పిలిచే నాయకురాలు ఈమె ఒక్కరే కావొచ్చు. ఎందుకంటే ఆమె బహిరంగంగానే అందరి ముందే రేవంత్ రెడ్డిని అరే ఒరే అని పిలుస్తారు. ఆమె సాధారణ నాయకురాలేమీ కాదు.. పాలమూరు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకురాలే. ఇంకా చెప్పాలంటే ఆమె భర్త కూడా రాజకీయ అనుభవం ఉన్నవ్యక్తే. జిల్లా, రాష్ట్ర రాజకీయాలు నిడిపిన మనిషే.

ఇదంతా ఎందుకు ఆమె ఎవరో చెప్పండి.. టెన్షన్ భరించలేము అని మీకు అనిపిస్తుందా? కొంచెం కోపంగా కూడా ఉందా? అయితే రేపు పార్ట్ 2 స్టోరీలో ఆమె పూర్తి వివరాలు అందిస్తాము. రేపటి వరకు వేచి చూడగలరని మనవి....

 (ఇట్లు... ధన్యవాదాలతో... ఏషియా నెట్ ఎడిటోరియల్ టీం)

 

చిరంజీవి ఇంట్లో దొంగతనం.. ఈ వార్తతోపాటు

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/KBSmWW

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం