
కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎంతగా పాతుకుపోయారో తెలిపే సంఘటన ఒకటి జరిగింది. ఒకవైపు టిఆర్ఎస్ మంత్రులు పోటీ పడి ఆపరేషన్ ఆకర్ష్ కోసం ప్రయత్నం చేస్తుంటే కొడంగల్ లో రేవంత్ అనుచరులు మాత్రం తాము రేవంత్ వెంటే ఉంటామంటున్నారు.
దౌలతాబాద్ మండలంలో చాలా మంది రేవంత్ అనుచరులు టిఆర్ఎస్ లో చేరారంటూ వార్తలు రావడం, తర్వాత వారంతా మళ్లీ రేవంత్ సమక్షంలో టిడిపిలో చేరడం జరిగిపోయాయి.
అయితే దౌలతాబాద్ లో కొందరు నేతలు టిఆర్ఎస్ లో చేరారని తెలియగానే మండలానికి చెందిన సుమారు 400 మంది రేవంత్ అభిమానులు సమావేశమయ్యారు. మండల నాయకులు తిరుపతిరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సత్యపాల్ అనే నాయకుడి తోటలో అందరూ సమావేశమై రేవంత్ రెడ్డితోనే తాము ఉంటామని ప్రకటించారు.
వెళ్లేవారు వెళ్లిపోయినా తాము మాత్రం రేవంత్ తోనే పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నారు.