
ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సెర్ప్ మూడవ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెర్ప్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మూడవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 20 ఎజెండా అంశాలపై కూలంకుశంగా చర్చించారు. అన్ని క్యాడర్లలో ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 117 డీపీఎం పోస్టులు ఉండగా వీటిని 161 కి పెంచేందుకు సెర్ప్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సెర్ప్ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా అమలుచేసేందుకు డీపీఎం పోస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. అలాగే ఏపీడీ పోస్టులను కూడా 12 నుండి 28 కి పెంచేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందులో 70:30 లెక్కన 19 పోస్టులను సెర్ప్ ఉద్యోగులతోను, మిగిలిన 9 పోస్టులను ప్రభుత్వ ఉద్యోగులతోను భర్తి చేయనున్నారు.
మహిళాసంఘాల సంఖ్య ఆధారంగా మండల సమాఖ్య క్లస్టర్లను విభజించాలని నిర్ణయించారు. సాధారణ మండలాల్లో అయితే 200 మహిళా సంఘాలతో, వెనుకబడిన లేదా టీఆర్ఐజీపీ అమలు అవుతున్న మండలాల్లో అయితే 150 మహిళాసంఘాలతో మండల సమాఖ్య క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఇంటీరియల్ మండలాల్లో అయితే 100 మహిళాసంఘాలకు ఒక మండల సమాఖ్య క్లస్టర్ ఏర్పాటుకానుంది. సెర్ప్ ఉద్యోగుల రోజువారి భత్యాన్ని (డీఏ) 50 రూ. పెంచుతూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 18 వార్షిక సెలవులు, 12 సాధారణ సెలవులతో పాటు అనారోగ్య కారణాలతో 5 ఏళ్ల కాంట్రాక్ట్ కాలంలో మరో 90 వేతనంతో కూడిన సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ... సెర్ప్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనారోగ్య కారణాలతో సెలవు కోరితే దాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
వీటితో పాటు 2015 – 16 ఆడిట్ రిపోర్టుకు ఆమోదం తెలిపిన సెర్ప్ కౌన్సిల్ .... ఆరుగురు యంగ్ ప్రోఫెషన్స్ నియమకానికి, టీఆర్ఐజీపీలో మరో నలుగురు అధికారుల నియామకానికి ఆమోదం తెలిపింది. అలాగే పలువురు ఉద్యోగులకు ఫిక్స్ డ్ ట్రావెలింగ్ అలవెన్స్, మరి కొందరు ఉద్యోగులకు అద్దె వాహనాలు ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బేగంపేటలో ఈ మహిళ ఎలా రెచ్చిపోయి కారు నడిపిందో చూడండి (వీడియో)