
సిఎం కేసిఆర్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అ గుర్తు చేసుకున్న ఘటన ఎక్కడో కాదు శాసనమండలి బిఎసి సమావేశంలో కావడం ఆసక్తికరం. తెలంగాణ శాసన మండలి బీఏసీ సమావేశం మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ అధ్యక్షన నిర్వహించారు. సీఎం కేసీఆర్..ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ ఆలీ, శాసనసభా వ్యవహార మంత్రి హరీష్ రావు., ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్, మండలి ప్రధాన ప్రతిపక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్, ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బొడకుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలి బీఏసీ సమావేశంలో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు సీఎం కేసీఆర్. తాను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న రోజుల్లో శాసనమండలి సమావేశాల తీరును ప్రశంసిన సీఎం. అప్పట్లో మండలిలో అర్దవంతమైన చర్చలు జరిగేవని చెప్పారు. 1978-80 ప్రాంతాల్లో మండలి చర్చల్లో జూపూడి యజ్ఞనారాయణ, మానిక్ రావు, కే.కేశవరావులు ప్రజాసమస్యలపై సంపూర్ణ అవగాహనతో వివిధ చర్చల్లో పాల్గొనేవారని.. ప్రభుత్వం వారిచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు హుందాగా స్వీకరించేదని వివరించారు. కొన్ని సందర్బాల్లో వారి లోతైన అవగాహణకు అధికార పక్షంతో పాటు సభ్యులు, మండలి సందర్శకులు ముగ్ధులయ్యోవారన్నారు. కొన్ని సందర్భాల్లో అధికార పక్షం కూడా ఇరుకున పడేదని మంత్రులు మండలికి వచ్చి సమాధాలిచ్చేందుకు వెనుకాడేవారని గుర్తుచేసారు.
ఇప్పుడు కూడా శాసన సభతో పోల్చితే మండలిలో ఎలాంటి అంతరాయాలు అవాంతరాలు లేకుండా సాఫీగా చర్చలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. కేసిఆర్ మాటలతో మిగతా వారంగా ఏకీభవించారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా సభలో అర్దవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నామని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు, ప్రజలెదుర్కుంటున్న తక్షణ సమస్యలగూర్చి చర్చిస్తే నేను కూడా సభకు క్రమం తప్పకుండా హాజరవుతానని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే శాసన సభలో చర్చకొచ్చే అంశం అదే రోజు మండలిలో ఎజెండాలో చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బేగంపేటలో ఈ మహిళ ఎలా రెచ్చిపోయి కారు నడిపిందో చూడండి (వీడియో)