భర్త నిత్యం తాగొచ్చి టార్చర్ పెడుతున్నాడని తాళ్లతో బంధించిన భార్య.. కళ్లలో కారం చల్లి, ఒంటిపై వేడి నీళ్లు పోసి

Published : Sep 03, 2023, 11:40 AM IST
భర్త నిత్యం తాగొచ్చి టార్చర్ పెడుతున్నాడని తాళ్లతో బంధించిన భార్య.. కళ్లలో కారం చల్లి, ఒంటిపై వేడి నీళ్లు పోసి

సారాంశం

తాగుబోతు భర్త ఆగడాలు భరించలేక ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టింది. కళ్లలో కారం చల్లి, శరీరంపై వేడి నీళ్లు పోసి గాయపర్చింది. దీంతో అతడు మరణించాడు.    

వారిద్దరూ భార్యాభర్తలు. కొంత కాలం నుంచి భర్త తాగుడికి అలవాటు పడ్డాడు. నిత్యం తాగి వచ్చి ఇంట్లో భార్యను వేధించేవాడు. ఇలా తరచూ జరిగేది. దీంతో భార్య విసిగిపోయింది. తీరు మార్చుకోవాలని భర్తకు చెప్పింది. అయినా అతడిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఆమెకు ఓపిక నశించి భర్తను హతమార్చింది. హతమార్చేముందు అతడిని చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో చోటు చేసుకుంది. 

ఇద్దరు మగ పిల్లలకు వివాహం.. కర్ణాటకలో విచిత్ర ఘటన.. ఇలా ఎందుకు చేశారంటే ?

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మండలంలోని ఘణపూర్‌ గ్రామంలో చెందిన వెంకటేష్- విజయ అనే భార్య భర్తలు నివసిస్తున్నారు. కొంత కాలం నుంచి విజయ్ తాగుడికి అలవాడుపడ్డాడు. ఇంటికి వచ్చి తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. తాగుడు మానేయాలని, తీరు మార్చుకోవాలని పలు మార్లు విజయ అతడికి చెప్పింది. కానీ అతడు ప్రవర్తన మార్చుకోలేదు.

వైద్యం కోసం తిప్పలు.. గిరిజన బాలికను చెక్క బల్లపై పడుకోబెట్టి 25 కిలో మీటర్లు తరలించిన బంధువులు..

తాగొచ్చి భార్యను వేధించడం మానుకోలేదు. దీంతో విసిగిపోయిన విజయ.. వెంకటేష్ ను తాళ్తతో కట్టేసింది. ఇక ఎటూ తప్పించుకుపోలేడని నిర్ధారించుకొని అతడి కళ్లలో కారం కొట్టింది. అతడి శరీరంపై వేడినీళ్లు గుమ్మరించింది. దీంతో అతడు బాధతో అల్లాడిపోయాడు. కానీ ఆమె చలించలేదు.

మద్యం మత్తులో భార్యతో గొడవ.. కాలుతో ఉయ్యాలను తన్నడంతో కిందపడి నెలన్నర శిశువు మృతి

నొప్పి భరించలేక అతడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొన.. బాధితుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలపాలైన వెంకటేష్.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు