దేశంలో సచివాలయానికి రాకుండా పాలించే సిఎం ఎవరు?

Published : Aug 30, 2017, 05:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
దేశంలో సచివాలయానికి  రాకుండా పాలించే సిఎం ఎవరు?

సారాంశం

దేశంలో సచివాలయానికి రాకుండా పాలించే  సిఎం ఎవరు? సీనియర్ బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి ఈ ప్రశ్నకు జవాబు చెబుతున్నారు మంత్రులు ఫామ్ హౌస్ లో ఉండరాదన్నారు.

సీనియర్ తెలంగాణ  బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డికి  తెలంగాణా ప్రభుత్వం తీరు మీద  తెగ కోపమొచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ మరీ మండిపడ్డారు. దేశంలో సచివాలయం కి రాకుండా పాలించే ఏకైక సీఎం కెసిఆర్ మాత్రమే నని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పాలన తుగ్లక్ పాలన ని మించి పోయిందని  అన్నారు. గతంలో వ్యవసాయ రంగానికి 5 గురు మంత్రులుండేవారు. అనుభవం లేని ఆ మంత్రులు కేవలం ఫాంహౌస్ లోనే గడిపేవారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రుల కార్యాలయాలలో విత్తన, యంత్రాల పరికరాల కంపెనీల ప్రతినిధులు పెత్తనం చెలాయించేవారు. నేడు తెలంగాణలో నకిలీ విత్తనాల తయారిదారులపై పిడి యాక్ట్ లు పెట్టి జైళ్ళకు పంపిస్తున్నాం. రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నాం. 

నిజాంబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ టెక్నాలజీ కాలేజీ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.

ఆయనకు ఇంత కొపమొచ్చేందుకు కారణాలు...

కొత్త జిల్లాల్లో నేటికి రిజిస్టార్స్ లేరు,

కొత్త జిల్లా కేంద్రాలలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో పూర్తిస్థాయి అధికారులు లేరు,

కెసి ఆర్ మాయమాటలతో 3సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు,

15 రోజుల్లో భూ-సర్వే పూర్తి చేయడం అసాధ్యం,

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టార్ల సర్వర్లు అన్ని డౌన్ ఉన్నాయి

భూములపై అవగాహన లేమితో పుటకోమాట మాట్లాడుతూ పుటగడుపుతున్నాడు సీఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలని శత్రువుల్లా చూస్తున్నాడు

అఖిలపక్షం పెట్టకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం భావ్యం కాదు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్