మంత్రి పోచారం ఇలా ఆవేశపడ్డారు ఈ రోజు...

Published : Aug 30, 2017, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మంత్రి పోచారం ఇలా ఆవేశపడ్డారు ఈ రోజు...

సారాంశం

ఆ సమయమోస్తే, ఎవరో చెప్పేదాకా ఉండను, స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటానంటున్న తెలంగాణా మంత్రి పోచారం

 

నిజాంబాద్ లోజరిగిన ఒకసమావేశంలో వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి బాగా ఆవేశపడ్డారు. ఉద్వేగానికి లోనయ్యారు.

ఉద్యమాలతో కొట్లాడి తెలంగాణను తెచ్చుకుంది పదవుల కోసం కాదు అని స్పష్టంగా ప్రకటించేశారు.

 ‘ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి నాలుగు కోట్ల ప్రజల మొహాలలో చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ ద్యేయం’ అని ఆవేశంగా ప్రసంగించారు.

అంతేకాదు, తర్వాత ఆయన జాతీయ స్థాయికి కూడా వెళ్లారు.

‘భారతదేశానికి ఉన్నన్ని వనరులు మరే దేశానికి లేవు. దొంగ బాబాలను అరెస్టు చెస్తే కొన్ని రాష్ట్రాలలో విద్వంసం జరగడం విచారం. హత్యలు, నేరాలు చెసే వారికి ప్రజాప్రతినిధులు మద్దతు తెలపడం శోచనీయం,’ అని విచారం వ్యక్తం చేశారు.

ఇక తన గురించి చెబుతూ... ‘‘నాకు ఓపిక లేకపోతే, పనిచేయలేని ఆరోగ్య పరిస్థితులు వస్తే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను తప్ప మరోకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వను,’ అని చాలా ఉద్వేగంగా తెలిపారు. అందరిని ఆశ్చర్య పరిచారు.

ఈ రోజు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో రూ. 16 కోట్లతో నూతనంగా నిర్మించిన తెలంగాణ మొదటి "ఆహార శాస్ర్త సాంకేతిక విజ్ఞాన కళాశాల" భవనాలను ప్రారంభిస్తూ  మంత్రి ఇలా ఆవేశపూరిత ప్రసంగం చేశారు.

రైతు పది వేళ్ళు భూమి మీద పెడితెనే ప్రజల అయిదు వేళ్ళు నోట్లొకి వెళతాయంటూ, ‘  తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ కళాశాల తెలంగాణకు, ఉద్యాన కళాశాల ఆంధ్ర ప్రాంతానికి కేటాయించడం జరిగింది. భారతదేశంలో మొత్తం 12 ఫుడ్ సైన్స్ కళాశాలలు ఉండగా 13వ కాలేజిని తెలంగాణలోఅందునా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినేట్ సమావేశంలొ అజెండాను ప్రవేశపెట్టి ఈ కళాశాలను స్థాపించడానికి అనుమతిచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు క్రుతజ్ఞతలు. వ్యవసాయ రంగం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి దృడ సంకల్పంతో ముందుకెళుతున్నారు,’ అని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్