ప్రేమ పేరుతో ఓ బాలుడు పదే పదే తన కూతురు వెంట పడుతున్నాడని ఆ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో బాలుడిని తన తల్లితో కలిసి తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆ బాలుడు గాయాలతో మరణించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ బాలుడిది తెలిసీ తెలియని వయస్సు. తన కంటే ఓ ఏడాది చిన్నదైన బాలిక పట్ల ఆకర్శితుడయ్యాడు. అది ప్రేమ అని భావించాడు. ఈ విషయాన్ని బాలికకు చెబుతూ ఆమె వెంట పడ్డాడు. దీంతో పలుమార్లు బాలిక పలుమార్లు ఈ విషయాన్ని పెద్దలకు చెప్పింది. ఇది మంచి పద్దతి కాదని ఆ బాలుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకుండా వెంటపడుతున్నాడనే కోపంతో బాలిక తండ్రి బాలుడిని తీవ్రంగా చితకబాదాడు. దీంతో బాలుడు తీవ్రగాయాలతో చనిపోయాడు.
కర్ణాటక కేబినెట్ విస్తరణ.. సిద్దరామయ్య మంత్రివర్గంలోకి 24 మంది..? రేపే ప్రమాణ స్వీకారం..
వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక నల్గొండలో టెన్త్ క్లాస్ చదువుకుంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉండి చదువు కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన ఓ 17 ఏళ్ల బాలుడు ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన ఆ బాలుడికి పాఠశాలలో చదివేటప్పుడే బాలికతో పరిచయం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం వేసవి సెలవులు కాబట్టి బాలిక తన గ్రామంలోనే ఉంటోంది. దీంతో బాలికను కలిసేందుకు బాలుడు తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి కొప్పోలు గ్రామానికి గురువారం వచ్చాడు. అనంతరం మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంట్లోకి వెళ్లాడు. దీనిని బాలిక నానమ్మ గమనించింది. బయటి నుంచి గొళ్లెం పెట్టి ఈ విషయాన్ని బాలిక తండ్రికి తెలిపింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి తలుపులు తీశాడు. అనంతరం బాలిక నానమ్మ, తండ్రి కలిసి బాలుడిని కర్రలతో చితకబాదాడు.
పార్లమెంటు ప్రారంభోత్సవానికి మేము వస్తాం.. ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించిన రెండు పార్టీలు.. ఏవంటే ?
దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. నొప్పితో తల్లడిల్లుతూ బాలుడు అక్కడే మరణించాడు. ఈ ఘటనపై గుర్రంపోడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారని తెలుస్తోంది. అతడు తన సోదరి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. స్కూల్ లో చదువుతున్నప్పుడే బాలుడు ఆ బాలిక వెంట పడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ సమయంలోనే బాలుడిని కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు. కానీ బాలుడి తీరులో మార్పు రాలేదు. ఆరు నెలల కిందట బాలుడి తీరుపై షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నల్గొండకు పిలిచి మందలించారని తెలుస్తోంది. అయినా కూడా గురువారం బాలుడు బాలిక ఇంటికి వెళ్లడంతో క్షణికావేశంలో ఈ ఘటన జరిగింది.