రెస్క్యూ టీంను ముప్పు తిప్పలు పెట్టిన ఎలుగుబంటి.. 8 గంటల ఆపరేషన్ ఎలా సాగిందంటే ?

By Sairam Indur  |  First Published Feb 6, 2024, 4:58 PM IST

కరీంనగర్ (Karimnagar)జిల్లా మానకొండూరు (Manakonduru)లో చెట్టుపై కనిపించిన ఎలుగుబంటి (bear)ని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ (rescue team) బంధించింది. మత్తు ఇంజక్షన్ సాయంతో దానిని బోనులో బంధించి, వరంగల్ (warangal)తీసుకెళ్లారు.


కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో చెట్టు మీద ప్రత్యక్షమైన ఎలుగుబంటి కథ సుఖాంతమైంది. సుమారు 8 గంటల పాటు కొనసాగిన ఎలుగుబంటి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మంగళవారం తెల్లవారుజామున మానకొండూరు చెరువు కట్ట వద్ద వరంగల్ రహదారి పక్కనే చెట్టు ఎక్కి కూర్చున్న బల్లూకంను ఫారెస్ట్ ఆఫీసర్లు, లోకల్ పోలీసులు కష్టపడి పట్టుకున్నారు. 

అవును.. బిస్కెట్ ను కుక్క యజమానికి ఇచ్చాను.. అందులో తప్పేముంది - వైరల్ వీడియోపై రాహుల్ గాంధీ

Latest Videos

ఉదయం 6 గంటలకు మానకొండూర్ వరంగల్ రహదారిపై ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక అధికారులు.. వరంగల్ లో ఉన్న రెస్క్యూ టీం కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ టీం 11 గంటల ప్రాంతంలో మానకొండూరు చేరుకుంది.

మురికి కుంటలో వివాహ వార్షికోత్సవం.. బ్యాండ్ లు కొడుతూ డ్యాన్స్ చేసిన స్థానికులు..ఎందుకంటే ?

అయితే ఎలుగు బంటికి మత్తు ఇచ్చిన తరువాత దానిని బంధించాలని రెస్క్యూ టీమ్ భావించింది. కానీ మత్తు మందు ఇంజక్షన్ లోడ్ చేస్తున్న సమయంలోనే ఎలుగుబంటి చెట్టు దిగి మానకొండూరు చెరువు వైపు పరుగెత్తింది. దీంతో రెస్క్యూ టీమ్ కు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. చెరువు దగ్గర ఉన్న చెట్లపొదలోకి వేగంగా వెళ్లిపోయింది.

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

వెంటనే అక్కడున్న అధికారులు టపాసులు పేల్చారు. ఈ అలజడికి ఎలుగబంటి బయటకు వచ్చింది. వెంటనే వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో మత్తు ఇంజక్షన్ ను ఎలుగుబంటికి వేశారు. అయినా కూడా ఆ బల్లూకం బెదరలేదు. కొంత దూరం అలాగే పరిగెత్తింది. కొంత దూరం పరిగెత్తిన తరువాత అది స్పృహ తప్పి కింద పడిపోయింది.

తల్లి కోసం బస్సు ఆపలేదని చేజింగ్.. అరగంట పాటు ఆపేసి యువకుడి ఆందోళన (వీడియో)

వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని పట్టుకొని వ్యాన్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బోనులో వేసి బంధించారు. ఆ వ్యాన్ లోని వరంగల్ కు తీసుకెళ్లారు. దీంతో ఎలుగుబంటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యింది. 

click me!