నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్

By narsimha lode  |  First Published Feb 6, 2024, 4:42 PM IST


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత  తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు.  కాంగ్రెస్ సర్కార్ పై  ఆందోళన కార్యక్రమాలకు  కేసీఆర్  ప్లాన్ చేస్తున్నారు.


హైదరాబాద్: తనను, బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  వల్ల కాదని  భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో  కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్  సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను  తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందనే  ప్రచారంపై  ఆందోళనకు  బీఆర్ఎస్ పార్టీ సన్నాహలు చేస్తుంది.  

also read:ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్: కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీ

Latest Videos

undefined

ఈ మేరకు  ఈ నెల  13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కంటే హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని ఆయన గుర్తు చేశారు.

also read:నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే  తాను స్పష్టంగా చెప్పానని ఆయన గుర్తు చేశారు.ప్రాజెక్టులు అప్పగించకుంటే  నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి బెదిరించారన్నారు.కావాలంటే  తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో అని తాను అప్పట్లో కేంద్ర మంత్రికి తేల్చి చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.

also read:నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: గ్రూప్-1లో మరో 60 పోస్టుల పెంపు

తెలంగాణకు అన్యాయం చేస్తుంటే  అస్సలు ఊరుకోననని చెప్పానన్నారు.కొత్త సీఎం తనను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ ను తిడుతున్నారని  కేసీఆర్ చెప్పారు.పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు  కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడన్నారు.ఉడుత బెదిరింపులకు తాను భయపడనని కేసీఆర్ చెప్పారు.

click me!