ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం..

By Sairam IndurFirst Published Feb 4, 2024, 10:30 AM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకోనుంది. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉన్న ‘టీఎస్’ (TS) స్థానంలో ‘టీజీ’ (TG)ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై నేడు జరిగే మంత్రివర్గ సమావేశం (cabinet meeting)లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

తెలంగాణలోని వాహనాల నెంబర్ పేట్లపై ఇక నుంచి ‘టీఎస్’ కనిపించకుండా పోనుంది. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నీ ‘టీజీ’ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తీసుకురావాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయం నేడు జరగబోయే మంత్రివర్గం సమావేశం తరువాత వెలువడుతుందని సమాచారం.

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?

Latest Videos

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలపై ‘టీఎస్’ అనే అక్షరాలు కనిపిస్తాయి. వాస్తవానికి రాష్ట్రం రాకముందు, వచ్చిన కొత్తలో అందరూ ‘టీజీ’ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్’ ను సూచించే ‘టీఎస్’ అనే అక్షరాలను అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రంపై తమ కాంక్షను తెలియజేసేందుకు చాలా మంది తమ వాహనాలపై అనధికారికంగా ‘టీజీ’ అని నెంబర్ ప్లేట్లు పెట్టించుకున్నారు.

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను షార్ట్ ఫామ్ లో ‘ఏపీ’ అని పిలిచేవారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఉద్యమ సమయంలో కూడా చాలా మంది తెలంగాణను ‘టీజీ’ అని సంభోదించేవారు. విడిపోయిన తరువాత ఇక అదే పేరుతోనే పిలుస్తారని చాలా మంది భావించారు. కానీ రాష్ట్రం పేరు చిన్నగా ఉండటంతో ‘తెలంగాణ’ అనే పిలుస్తున్నారు. అయితే వాహనాలపై అయినా ‘టీజీ’ ఉంటుందని అనుకుంటే అధికారికంగా ‘టీఎస్’ గా మారిపోయింది.

నమీబియా అధ్యక్షుడు హాగే గీంగోబ్ మృతి..

కానీ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో మళ్లీ ‘టీజీ’ పేరును తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నేడు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన మరో రెండు హామీల అమలుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఈ హామీల్లో మహాలక్ష్మీ గ్యారెంటీలో భాగంగా ఉన్న రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకంలో భాగంగా ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వీటి అమలకు ప్రధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

click me!