హైద్రాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: మోడీ దిష్టిబొమ్మ దగ్దానికి జగ్గారెడ్డి యత్నం, అడ్డుకున్న పోలీసులు

Published : Jun 14, 2022, 06:34 PM ISTUpdated : Jun 14, 2022, 06:38 PM IST
 హైద్రాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద   ఉద్రిక్తత: మోడీ దిష్టిబొమ్మ దగ్దానికి జగ్గారెడ్డి యత్నం, అడ్డుకున్న పోలీసులు

సారాంశం

హైద్రాబాద్ ఈడీ కార్యాలయం వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రయత్నించారు. జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.


హైదరాబాద్: Hyderabad నగరంలోని Enforcement Directorate  కార్యాలయం వద్ద  మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానమంత్రి Narendra Modi  దిష్టిబొమ్మను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy  దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డి సహా Congress పార్టీ శ్రేణులను అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈడీ కార్యాలయం నుండి  కాంగ్రెస్ పార్టీ నేతలు Gandhi Bhavan వద్ద దీక్షకు దిగారు.

రెండు రోజులుగా హైద్రాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ పార్టీ మాజీ చీఫ్  Rahul Gandhi ని రెండు రోజులుగా ED  అధికారులు విచారిస్తున్నారు. national herald case కేసులో రాహుల్ గాంధీని విచారిస్తున్నారు. సాయంత్రం ఆందోళన ముగిసిన తర్వాత ఈడీ కార్యాలయం ముందు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు గాను ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డిని దిష్టిబొమ్మ దగ్దం చేయకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.  దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

also read:ఈడీ విచారణ పేరుతో రాహుల్‌గాంధీకి బీజేపీ వేధింపులు: హైద్రాబాద్‌ నిరసనలో రేవంత్ రెడ్డి

ఈడీ కార్యాలయం నుండి కాంగ్రెస్ నేతలు నేరుగా గాంధీ భవన్ కు చేరుకున్నారు.  రాహుల్ గాంధీకి ఈడీ కార్యాలయంలో విచారణ ముగిసే వరకు తమ దీక్ష చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం  తీసుకుంది. ఈడీ కార్యాలయం నుండి రాహుల్ గాంధీ బయటకు వచ్చిన తర్వాతే దీక్షను విరమిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.నిన్న రాత్రి కూడా రాహుల్ గాంధీని 11 గంటల వరకు విచారణ చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!