తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలపై అధికారుల క్లారిటీ..

Published : Jun 14, 2022, 05:37 PM ISTUpdated : Jun 14, 2022, 05:39 PM IST
 తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలపై అధికారుల క్లారిటీ..

సారాంశం

తెలంగాణ ఇంటర్ పరీక్షల విడుదలు.. జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షల విడుదలు.. జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. రేపు ఫలితాలు విడుదల అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని, ఇటువంటి ప్రచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మవద్దని చెప్పింది. ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీని నిర్ణయించలేదని తెలిపింది. ఫలితాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 25 తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల పేపర్ కరెక్షన్ ముగియనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోస్టు వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక, ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు.  మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. 

మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు.. ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తి కావడంతో.. పోస్టు వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్