సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Nov 15, 2021, 6:37 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు దుండగులు. దీంతో సంజయ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.



సూర్యాపేట: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కాన్వాయ్ పై సూర్యాపేట జిల్లాలో  గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. దీంతో బండి సంజయ్ కాన్వాయ్ లోని  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు ఇవాళ బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

నల్గొండకు సమీపంలోని అర్జాలబావి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ ను  వెళ్లిపోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్ పరిశీలిస్తున్న సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు చోటు చేసుకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పరం చెప్పులు, కోడిగుడ్లు విసురుకొన్నారు. నల్ల జెండాలు పట్టుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.నల్గొండ నుండి Bandi Sanjay మిర్యాలగూడకు సమీపంలోని శెట్టిపాలెం వద్ద Paddy ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన సమయంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకొంది. బండి సంజయ్ ను అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు.  

Latest Videos

పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. Suryapet జిల్లాలోని చిల్లేపల్లి వద్ద భారీగా మోహరించిన trs కార్యకర్తలు తమ కాన్వాయ్ పై రాళ్లతో దాడికి దిగారని bjp  ఆరోపిస్తోంది.  దీంతో బండి సంజయ్ కాన్వాయ్ లోని  కారు అద్దాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. రాళ్ల దాడితో పోలీసులు బందోబస్తుతో చిల్లేపల్లి నుండి సంజయ్ కాన్వాయ్ ను తీసుకెళ్లారు.  మూసీ వంతెనపై బైఠాయించి బండి సంజయ్ వెనక్కు వెళ్లాలని నినాదాలు చేశారు.మరో వైపు ఈ దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

also read:బండి సంజయ్‌వి పచ్చి అబద్ధాలు.. ఆయనను అధ్యక్షుడిగా బీజేపీ ఎందుకు పెట్టింది?: తలసాని

 వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుధ్దం కొనసాగుతుంది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుండి స్పష్టత వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 12న  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను టీఆర్ఎస్ నిర్వహించింది. మరో వైపు ఈ నెల 11న వర్షాకాలానికి చెందిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది.రాష్ట్రంలో యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. వరి పండిస్తే  ప్రభుత్వం కొనుగోలు చేయబోదని తేల్చి చెప్పింది.  సీడ్ పరిశ్రమలతో, మిల్లర్లతో ఒప్పందాలు ఉన్న రైతులు వరి ధాన్యం  వేసుకోవచ్చని ప్రభుత్వం తేల్చి చెప్పింది.వరి ధాన్యం  కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు చోటు చేసుకొంది.  ఈ అంశాన్ని తీసుకొని బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పరం  విమర్శలు చేసుకొంటున్నాయి. ఈ అంశాన్ని తీసుకొని రెండు పార్టీల నేతలు మైలేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. 

click me!