Telugu akademi scam: మాజీ డైరెక్టర్ పీఏ వినయ్‌కుమార్ లీలలెన్నో, రూ. 12 లక్షలు సీజ్

By narsimha lode  |  First Published Oct 10, 2021, 10:14 AM IST

తెలుగు అకాడమీ స్కామ్ లో పోలీసులు నిందితుల పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ వినయ్ కుమార్ పాత్రకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. మరికొందరు నిందితుల గురించి
 లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



హైదరాబాద్: తెలుగు అకాడమీ కుంభకోణంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్  somi reddy పీఏగా పనిచేసిన వినయ్‌కుమార్ పాత్రపై పోలీసులుకీలక అంశాలను సేకరించారు.

also read:తెలుగు అకాడమీ స్కామ్: రంగంలోకి దిగిన ఈడీ, రమేష్ సహా పలువురి విచారణ

Latest Videos

ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi కి చెందిన రూ.64.5 కోట్ల నిధులను నిందితులు పథకం ప్రకారంగా బ్యాంకుల నుండి డ్రా చేశారని సీసీఎస్ పోలీసులు  తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపై ccs పోలీసులు  ఆధారాలను సేకరిస్తున్నారు.

సోమిరెడ్డికి పీఏగా వ్యవహరించిన vinay kumar ప్రధాన నిందితుడు సాయి‌కుమార్, వెంకటరమణ, బ్యాంకు మేనేజర్లు మస్తాన్ వలీ, సాధనలతో తరచూ మాట్లాడేవారని పోలీసులు గుర్తించారు. అకాడమీ నిధులను కాజేసేందుకు వీలుగా బ్యాంకు అధికారులతో పాటు నిందితులు ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా అకాడమీ ఉన్నతాధికారులను ఒప్పించేవాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కీలకమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాతే వినయ్‌కుమార్ ను అరెస్ట్ చేశారు. వినయ్‌కుమార్ ఇచ్చిన సమాచారంతో పువ్వాడ వెంకటరమణ అలియాస్ రమణారెడ్డి, భూపతిలను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనతికాలంలోనే వినయ్‌కి అందలం

తెలుగు అకాడమీలో డైరెక్టర్‌గా ఎవరు పనిచేసినా  వినయ్‌‌కుమార్  మాత్రం పీఏగానే కొనసాగాడు. అధికారులను తన మాటల చాతుర్యంతో వినయ్‌కుమార్ నమ్మించేవాడు. అంతేకాదు అధికారుల నమ్మకాన్ని చూరగొన్నాడు. తెలుగు అకాడమీ నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన సాయికుమార్ బృందానికి నిందితుడు సహకరించాడు.

రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకొన్న పోలీసులు

 తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల నిధులను నిందితులు కొల్లగొట్టారు. అయితే ఇప్పటివరకు  అరెస్టైన వారి నుండి కేవలం రూ. 12 లక్షలను పోలీసులు రికవరీ చేసుకొన్నారు. ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన సాయికుమార్ అత్యధికంగా రూ. 20 కోట్లు తీసుకొన్నాడని పోలీసులు గుర్తించారు. మిగిలిన నిందితులు కోటి నండి రెండు కోట్ల మేరకు తీసుకొన్నారు. ఈ  డబ్బులను నిందితులు రియల్‌ఏస్టే ట్ తో పాటు ఇతర రంగాల్లో పెట్టారని పోలీసులు గుర్తించారు.
 

click me!