గద్వాల జిల్లాలో విషాదం: గోడకూలి ఐదుగురు మృతి, ఇద్దరికి గాయాలు

Published : Oct 10, 2021, 09:26 AM ISTUpdated : Oct 10, 2021, 09:46 AM IST
గద్వాల జిల్లాలో విషాదం: గోడకూలి ఐదుగురు మృతి, ఇద్దరికి గాయాలు

సారాంశం

గద్వాల జిల్లా అయిజ మండలం  కొత్తపల్లిలో ఆదివారం నాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకొంది. గోడ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

గద్వాల: jogulamba gadwal జిల్లా  అయిజ మండలం kothapallyలో విషాదం చోటు చేసుకొంది. ఓ ఇంటి గోడకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది. ఒకే ఇంటిలో ఏడుగురు నిద్రిస్తున్న సమయంలో   గోడకూలడంతో నిద్రలోనే ఐదుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

also read:కోడిగుడ్డు కోసం పోతే.. ప్రాణాలు పోయాయి... !

కొత్తపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ, వారి పిల్లలు  తేజ, చరణ్ , రామ్, శాంతమ్మ భర్త  మోషలు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలు స్నేహా, చిన్నాలకు తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన ఇద్దరు చిన్నారులను గద్వాల ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల కురిసన వర్షాలకు గోడ తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.  ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్లలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?