‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’.. తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్...

By SumaBala BukkaFirst Published Dec 20, 2021, 8:08 AM IST
Highlights

ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ (34) హైదరాబాదులో ఆతిథ్య రంగంలో పని చేస్తున్నాడు. కోల్ కతాకు చెందిన చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ-కామర్స్ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ ద్వారా కలిశారు. రోజంతా కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. 

హైదరాబాద్ :  తెలంగాణలో తొలి ‘gay’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తన కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగసంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికి ఇలా చేశామని చెప్పారు.

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై..
ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ (34) హైదరాబాదులో ఆతిథ్య రంగంలో పని చేస్తున్నాడు. కోల్ కతాకు చెందిన చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ-కామర్స్ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ ద్వారా కలిశారు. రోజంతా కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. అంతిమంగా ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నారు.

అయితే తమ ప్రేమ, పెళ్లి, సహజీవనం... పేరేదైనా కానీ సమజం నుంచి తమకు ఆమోదం లభించదన్న భయంలో పడ్డారు. అందుతే తమ ప్రేమను బహిర్గతం చేయలేకపోయారు. అందుకే తాము ఉద్యోగాలు చేస్తున్న Hyderabad లోనే.. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా living together చేస్తున్నారు. కానీ ఇటీవలే వారికి ఇది ఇలా కాదు అనిపించింది. 

‘తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షిత ప్రాంతాలు..’ పదకొండో తరగతి బాలిక సూసైడ్ నోట్.. ఎంత వేదన అనుభవించిందో..

పేరెంట్స్ కూడా అలాగే అన్నాక…
నాలుగేళ్లుగా వారి సహజీవనం సాఫీగా సాగిపోతున్నా.. రహస్యమే.. ఇలా ఎంతకాలం?.. ఓ ఫైన్ మార్నింగ్ ఎందుకు ఇలా. ఎవరికీ చెప్పకుండా బతకాలి? అని ఇద్దరు ప్రశ్నించుకున్నారు. దీంతో వీళ్లిద్దరూ కలిసి గత ఫిబ్రవరి 14(lovers day)న తమ ఈ ప్రేమ వ్యవహారం ఓ ఆంగ్ల పత్రికకు interview ఇచ్చారు. అందులో ప్రచురితమైన అనంతర పరిణామాలతో ‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’ అని పేరెంట్స్ కి తేల్చి చెప్పేశారు. మొదట ఈ విషయం విన్న ఇరువైపుల పెద్దలు షాకయ్యారు. ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు. దీంతో వీరి పెళ్లికి అడ్డు లేకుండా పోయింది. పెళ్లి బాజాలు మొగాయి.

మొదటి ‘గే’ మ్యారేజ్
హైదరాబాద్ శంకర్పల్లి లోని ఓ రిసార్ట్ వీరి పెళ్ళికి వేదికయ్యింది. సంగీత్ వగైరా.. వేడుకలన్నీ భాగమైన ఈ రెండు రోజుల పెళ్లికి సిటీ చెందిన మరో ‘గే’ సోఫియా పురోహిత పాత్ర వహించారు. ఈ వివాహానికి Lesbian, gay, bisexual, ట్రాన్స్జెండర్( lgbt) కమ్యూనిటీకి చెందిన పలువురు హాజరయ్యారు. దాదాపు 60 మందిదాకా హాజరైన అతిథులందరికీ చక్కటి వెజిటేరియన్ విందు వడ్డించారు. పూర్తిగా వైట్ థీమ్ తో జరిగిన పెళ్లి కావడంతో ఇద్దరూ వైట్ కోట్స్ ధరించారు.

చట్టం గుర్తించకున్నా తగ్గేదే లేదు..
‘మా ప్రేమ సత్యమైనది. పెళ్లి ద్వారా మేము ఒక్కటవ్వడం మాత్రమే కాదు.. మాలా.. సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్ని అందించడమే లక్ష్యం’ అంటున్నారు ఈ  ‘గే’ జంట. మరి పిల్లలు అని అడిగిన వాళ్లకు ‘కాజు’ను చూపిస్తున్నారు. ‘కాజు’ ఎవరో కాదు కొన్నేళ్లుగా వీళ్లతో పాటు జీవిస్తున్న పెట్ డాగ్.  ‘కాజు మా దత్తపుత్రుడు’ అని మురిపెంగా అంటున్నారు. 
 

click me!