వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. ఈ సమయంలో మాట్లాడుతూ..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. వరి వద్దంటే ఉరి తప్ప మరే మార్గం లేదని రైతులు చెబుతున్నారని అన్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila ) ఆదివారం రైతు ఆవేదన యాత్రలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లింగంపల్లిలో పర్యటించారు. ఇటీవల ఈ మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాన్ని పరామర్శించారు. మండలం లోని కంచన్‌పల్లి గ్రామంలో దుంపల మహేష్, శ్రీకాంత్, కీసర శేఖర్‌గౌడ్, లింగంపల్లిలో బోన్ల శేఖర్ అనే రైతు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. ఈ సమయంలో వరి రైతులు, గ్రామస్తుల సమస్యలను తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. వరి వద్దంటే ఉరి తప్ప మరే మార్గం లేదని రైతులు చెబుతున్నారనీ, అసలు వరి ఎందుకు వేయొద్దో చెప్పాలని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యాసంగిలో వరిపంటను ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: జైపూర్: లగేజ్ బ్యాగ్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ . పట్టేసిన కస్టమ్స్, రూ.90 కోట్ల హెరాయిన్ స్వాధీనం
ప్రభుతం కూడా వరి కొంటుందనే భరోసా ఇవ్వాలనీ, రుణ మాఫీ చేయాలని అన్నారు. ఎంతమందికి చేశారో చెప్పాలి. బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారని, రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని షర్మిల అన్నారు. మరీ లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలని
డిమాండ్ చేశారు.
Read Also: పాల వ్యాన్‌లో మద్యం తరలింపు.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు
తెలంగాణలో ప్రాజెక్టులన్ని.. కమీషన్ల కోసమే కట్టించారా? అని ప్రశ్నించారు. వరి వేయం అని కేసీఆర్ కేంద్రానికి ఎందుకు రాసిచ్చారన్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులు ఆత్మహత్యలు పెరిగాయని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ప్రభుత్వమే వరిని కొనుగోలు చేయాలని, లేకపోతే.. రైతుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.
Read Also: ఢిల్లీలో ఆరు నెలల గరిష్టానికి కొత్త కేసులు.. పది రోజుల్లో తొలి కరోనా మరణం
ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఎంతమందికి రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేననీ, సీఎం కేసీఆర్ ఊసరవెల్లి లాగా మాటలు మారుస్తున్నారని విమర్శించారు. రైతును రాజు చేయడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యమని’’ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
కేసీఆర్ ఊసరవెల్లి లా మాట్లాడుతున్నారనీ, రైతులతో చెలగామటం ఆడుతున్నారని అన్నారు. ఓ సారి సన్న రకం వడ్లు వేయమంటరు. మరోసారి వడ్లు కొంటాం అంటరు. ఇంకోసారి అసలు వరి కొనబోము అంటరు.. ఇక వరి వేసే ఊరే అంటరు. ఏ పంట వేయాలో చెప్పే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని..? తెలంగాణ రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, రైతుల ఆత్మహత్యల పాపం కేసీఆర్‌దేనని చెప్పారు.