Hyderabad: దేశంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఎస్టీలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఈ విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.
Tribal welfare minister Satyavati Rathod: దేశంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఎస్టీలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఈ విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖైరతాబాద్ లోని డాక్టర్ విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన జాతీయ బంజారా మీట్ -2023కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గిరిజన భాష గోర్ మతిని 8వ షెడ్యూల్ లో చేర్చాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ఎస్టీలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మంత్రి సూచించారు. వచ్చే నెలలో పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తుందనీ, ఢిల్లీలో సేవాలాల్ భవనాన్ని నిర్మించాలని, సేవాలాల్ జన్మదినాన్ని జాతీయ పండుగగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కోరారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్రం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను నిర్మించారని, వాటికి గిరిజన విప్లవ నాయకుడు కుమ్రం భీం, బంజారా ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ పేర్లను పెట్టారని ఆమె గుర్తు చేశారు.
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆవాసాలను కలుపుతూ 3152.41 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మంజూరు చేసిందని, గిరిజన వర్గాల సాధికారత కోసం 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా అప్ గ్రేడ్ చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ బంజారా సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఘం అభివృద్ధి కోసం 14 తీర్మానాలు చేశారు.