నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన జూపల్లి అరెస్ట్: బైక్ దగ్దం , ఉద్రిక్తత

By narsimha lode  |  First Published May 29, 2023, 3:12 PM IST

నాగర్ కర్నూల్  కలెక్టరేట్ ముందు  ఇవాళ  మాజీ మంత్రి .జూపల్లి కృష్ణారావు  ధర్నాకు దిగారు. వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై  చర్యలకు ఆయన డిమాండ్  చేశారు. 


నాగర్ కర్నూల్:   మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావును  సోమవారంనాడు  పోలీసులు   అరెస్ట్   చేశారు.  నాగర్ కర్నూల్  కలెక్టరేట్  కార్యాలయం ముందు  రైతులతో  కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆందోళన  నిర్వహించారు.

వరి కొనుగోళ్లలో  అక్రమాలను  అరికట్టాలని   డిమాండ్ తో  నాగర్ కర్నూల్ కలెక్టర్ రేట్   ముందు  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు రైతులతో కలిసి   కలెక్టరేట్  ముందు  ధర్నా నిర్వహించారు.   ఈ విషయమై  కలెక్టర్ స్పందించాలని  జూపల్లి కృష్ణారావు డిమాండ్  చేశారు. అధికారుల నుండి స్పంద న రాకపోవడంతో   రోడ్డుపై బైఠాయించారు.   దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఎక్కడి వాహనాలు  అక్కడే  నిలిచిపోయాయి.

Latest Videos

 రోడ్డుకు ఇరువైపులా  భారీగా  వాహనాలు నిలిచిపోయాయి.  దీంతో  పోలీసులు  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  సహ  ఆందోళన  చేస్తున్న రైతులను  పోలీసులు అరెస్ట్  చేశారు.   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  అరెస్ట్ ను నిరసిస్తూ  ఆయన అనుచరులు బైక్ కు నిప్పు పెట్టారు. దీంతో  నాగర్ కర్నూల్ కలెక్టరేట్  వద్ద  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావును   బీఆర్ఎస్  సస్పెండ్  చేసింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో  చర్చలు జరుపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో  ఈ రెండు పార్టీల  నేతలు  చర్చిస్తున్నారు.  అయితే వీరిద్దరూ  ఏ పార్టీలో  చేరే విషయమై  ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  అయితే  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా   కీలక పాత్ర పోషించాలని  జూపల్లి కృష్ణారావు , పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలు  భావిస్తున్నారు.  నాగర్ కర్నూల్  జిల్లాలో  వరి ధాన్యం  కొనుగోళ్లలో అక్రమాలు చోటు  చేసుకున్నాయనే విషయమై  రైతులతో  కలిసి  జూపల్లి కృష్ణారావు  ఇవాళ ఆందోళనకు దిగారు. 

జూపల్లి కృష్ణారావు ఆందోళన  కారణంగా  ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో  పోలీసులు  జూపల్లి కృష్ణారావును  అరెస్ట్  చేశారు. ఇదిలా ఉంటే  జూపల్లి కృష్ణారావు  అరెస్ట్ ను  నిరసిస్తూ  రోడ్డుపై  బైఠాయించిన  ఆయన అనుచరులను  కూడ పోలీసులు అరెస్ట్  చేశారు. 

click me!