ఓల్డ్ సిటీ మాత్ర‌మే కాదు రాష్ట్రవ్యాప్తంగా పోటీ.. రానున్న ఎన్నిక‌ల‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published May 29, 2023, 3:24 PM IST
Highlights

Hyderabad: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
 

AIMIM President Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ పాతబస్తీ వెలుపల ఉన్న స్థానాల నుంచి సైతం పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) భావిస్తోందని స‌మాచారం. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చెప్పారు. ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఎంఐఎంను తేలిగ్గా తీసుకోలేమని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుర్కోవడంపై ఎంఐఎం దృష్టి సారించిందని చెబుతూనే,  ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించే చ‌ర్యలు కాదని ఒవైసీ స్పష్టం చేశారు.

బీజేపీని ఓడించడంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించింది : అసదుద్దీన్ ఒవైసీ

2014, 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ మునిసిపల్ వార్డుల్లో అభివృద్ధి జరగకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగించే అంశమని హెచ్చరించారు. తన నుంచి సానుకూల సంకేతాలు రాకుండా ముస్లింలు ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేయరని ఒవైసీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అధికారులకు లంచం ఇవ్వాల్సి న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆరోపించారు. 

ఓల్డ్ సిటీ వెలుపల పోటీ చేయాలని ఎంఐఎం భావించడం ఇదే మొదటిసారి కాదనీ,  తెలంగాణలోని 119 సీట్లకు గాను కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ యోచిస్తున్నట్లు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. 

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7న జరిగాయి. టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకుని విజయం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల వాటా 21 నుంచి 19కి పడిపోగా, ఎంఐఎం ఏడు స్థానాలను గెలుచుకోగలిగింది. మరోవైపు ఎన్నికల్లో విజ‌యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ దూకుడు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. దాని సీట్ల వాటా ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. ఓల్డ్ సిటీ వెలుపల పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ ముఖచిత్రం మారి, కీలక పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రభావం చూపే అవకాశముంది.

click me!