బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. మంత్రి వెంట విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఏడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులు ఆందోళన చేస్తున్నారు.
నిర్మల్: Basara IIIT ట్రిపుల్ ఐటీకి తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy సోమవారంనాడు మధ్యాహ్నం బయలుదేరారు. మంత్రి వెంట విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఏడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు Protest చేస్తున్నారు. 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ Students ఆందోళన చేస్తున్నారు.
విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి వైఎస్ చైర్మెన్లతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ నెల 18వ తేదీన మంత్రి Indrakaran Reddy విద్యార్ధులతో జరిగిన చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించారు.
undefined
కానీ విద్యార్ధులు మాత్రం చర్చలు విఫలమైనట్టుగా ప్రకటించారు. విద్యార్ధులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలపై సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు.
ఈ నెల 18న విద్యార్ధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. కానీ చర్చలు సఫలం కాలేదని విద్యార్ధులు తేల్చి చెప్పారు. ఇవాళ ఉదయం నుండి విద్యార్ధులు ఆందోళన సాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఏఓ ను ప్రభుత్వం విధుల నుండి తప్పించింది.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఏడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రోఫెసర్ సతీష్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. తాము లేవనెత్తిన 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు. చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనుకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు. మరో వైపు విద్యార్ధుల ఆందోళన విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరారు. అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ చెప్పారు.
వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు. మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు.
also read:బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా భేటీ
కానీ తాము చేస్తున్న 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి తమకు కచ్చితమైన హామీని ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు.ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులతో చర్చించేందుకు వెళ్లారు. మంత్రి విద్యార్ధులతో చర్చించి ఆందోళనను విరమింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది.