సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి కారణమైన వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన విషయాన్ని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: Secunderabad రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక ఎవరెవరున్నారనే విషయమై Police లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ Railway Station లో ఆందోళన చేయడం కోసం ఏర్పాటు చేసిన Whats App ల పై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో చేసిన పోస్టుల గురించి కూడా పోలీసులు గుర్తించారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ Defence కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్టుగా రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తున్నామని కూడా ఆమె వివరించారు. మరో వైపు సికింద్రాబాద్ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అభ్యర్ధుల పేరేంట్స్ చెబుతున్నారు.ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న వారిని కలిసేందుకు జైలు వద్ద ఆర్మీ అభ్యర్ధుల కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు.
undefined
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రెండు వేల మంది ఆందోళనలో పాల్గొన్నారని రైల్వే పోలీసులు చెప్పారు.. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని రైల్వే ఎస్పీ చెప్పారు.
వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం వుందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూప్‌లను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు, ప్రయాణీకులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని అనురాధ తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే ఎస్పీ వివరించారు.
ఈస్ట్ కోస్ట్, దనాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వాళ్లు వచ్చారని అనూరాధ తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసుందేరకు ఆర్పీఎఫ్ వాళ్లు కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. 17న ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్‌లోకి చొరబడ్డారని అనూరాధ తెలిపారు. రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం వుందన్నారు. ఘటనలో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని.. నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఒక కోచ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టారని.. పదుల సంఖ్యలో కోచ్‌లు ధ్వంసమయ్యాయని అనూరాధ పేర్కొన్నారు.