గత పది పదిహేనేళ్లుగా తెెలుగు అకాడమీలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలంటూ అకాడమీ ప్రాంగణంలో క్యాజువల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
హైదరాబాద్: చాలీచాలని జీతాలతో పది పదిహేనేళ్లుగా సాధారణ ఉద్యోగులు పనిచేస్తున్న తమను తొలగించే ప్రయత్నం జరుగుతోందని తెలుగు అకాడమీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటికయినా ఉన్నతాధికారులు తమ సర్వీసును గుర్తించి ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
గత శనివారం (18.06.2022) క్యాజువల్ ఉద్యోగులంతా అకాడమీ ప్రాంగణంలో నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఉద్యోగులు బయటపెట్టారు.
undefined
''ఇదే తెలుగు అకాడమీలో సాధారణ ఉద్యోగులుగా 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. గతంలో 2019లో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన యాజమాన్యం తమను తొలగించే ప్రయత్నం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేసాం. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, మా సర్వీసును పరిగణలోకి తీసుకుని ఖాళీగా వున్న పోస్టులలో రెగ్యులర్ చేయాల్సిందిగా తెలుగు అకాడమీని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరాము'' అని ఉద్యోగులు తెలిపారు.
''తెలుగు అకాడమీ 10వ షెడ్యూల్ లో వున్నందుకు అకాడమీ ఉద్యోగులను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించారు. ఈ క్రమంలోనే కొత్తగా ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏజన్సీలకు టెండర్లు పిలిచారు. దీన్ని సవాలు చేస్తూ స్టే కోసం హైకోర్టును ఆశ్రయించాం. కేసు పెండింగ్ లో వుంది. అయినప్పటికి తెలుగు అకాడమీ శ్రీనివాస్ ఆండ్ బ్రదర్స్ (ఫెసిలిటీ మేనేజ్ మెంట్) ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించింది. ఈ ఏజెన్సీ మా సర్వీస్ ను తొలగించేందుకు బయోడేటా ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తోంది. దీంతో మేము మానసిక ఆందోళనకు గురవుతున్నాం'' అంటూ అకాడమీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
''ఇక గత రెండు నెలల (ఏప్రిల్, మే) జీతాలను ఇప్పటివరకు చెల్లించలేదు. దీనిపై అకాడమీ సంచాలకులు దేవసేన ఐఎఎస్ కు వినతిపత్రం అందజేశాం. అయినప్పటికి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి గత శనివారం అకాడమీ వద్ద నిరసన తెలియజేసాం'' అని సాధారణ ఉద్యోగులు తెలిపారు.
ఉద్యోగుల డిమాండ్లివే:
కోర్టు కేసులో వున్నటువంటి సర్వీసును క్రమబద్దీకరించాలి
పెండింగ్ లో వున్న రెండు నెలల వేతనాలను ఏజెన్సీ ద్వారా కాకుండా అకాడమీ ద్వారానే చెల్లించాలి.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
పై డిమాండ్లపై సంచాలకు వెంటనే స్పందించారు.
తెలుగు అకాడమీ వద్ద నిరసనలో యం. అంజయ్య, యెల్చాల నర్సింలు, బాల్ దేవ్, నాగమణి, రమాదేవి, బాబురావు, పరశురాం, అరుణ్, చారి, కిషోర్, లలిత, శారద, లక్ష్మి, ధనస్వామి, శారద, నర్సింలు,సఖి, రేణుక తో పాటు క్యాజువల్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.