అభివృద్ధి నాగపూర్, గుజరాత్‌లకేనా... దక్షిణాదిని పట్టించుకోవడం లేదు: కేటీఆర్ వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Dec 4, 2019, 11:39 AM IST
Highlights

కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదని ఆయన ఆరోపించారు

కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన.. అభివృద్ధి కేవలం నాగపూర్‌కే పరిమితమా అని ప్రశ్నించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని కేటీఆర్ ఫైరయ్యారు. నాగపూర్, గుజరాత్, చెన్నైలను మాత్రమే పట్టించుకుంటున్నారని.. హైదరాబాద్, బెంగళూరు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 

Also Read:రేఖాజీ.. కొంచెం తెలుసుకొని మాట్లాడండి... మంత్రి కేటీఆర్ కౌంటర్

ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రి 8గంటలకు వరకే విధులు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ స్పందించారు. రాత్రి 8గంటల్లోపు మహిళలు ఇంట్లో ఉండాలని సీఎం చెప్పడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ సీఎం నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆమె ట్వీట్ చేశారు. ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు  జరగవా అని ప్రశ్నించారు.  సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. కాగా.. రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

కీలక స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన రేఖాశర్మకు సూచించారు. సీఎం కేసీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. 

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా చేరారు.

Also Read:నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్

ఆ క్రమంలో ఆయన ఆదివారం ప్రధాని నరేంద్రమోడీకి ట్వీట్ చేశారు. నిర్భయ ఘటనలో నిందితులకు ఏడేళ్లైనా ఉరిపడలేదని.. తొమ్మిదేళ్ల చిన్నారి ఘటనలోనూ నిందితులకు ఉరిశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మార్చిందని కేటీఆర్ గుర్తుచేశారు.

నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన శిక్షలు విధించాలని, రేపిస్టులకు అప్పీలుకు అవకాశాం లేకుండా ఉరిశిక్ష విధించాలని మంత్రి డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు సవరించాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టాన్ని ఆమోదించాలని కేటీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

click me!