హైద్రాబాద్‌లో టెక్కీ పూర్ణిమ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ మృతికి భర్తే కారణమని కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
హైదరాబాద్:హైదరాబాద్ సనత్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్ణిమ మృతిపై భర్త కార్తీక్ పై పూర్ణిమ కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పూర్ణిమను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూర్ణిమ 20 రోజుల క్రితం తన ప్రియుడు కార్తీక్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరిద్దరూ సనత్‌నగర్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన 20 రోజులకే పూర్ణిమ అనుమానాస్పదంగా మృతి చెందడంపై పూర్ణిమ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్ణిమను కార్తీక్ హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.పూర్ణిమ ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పూర్ణిమ మరణానికి కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైద్రాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కూతురే పూర్ణిమ.హైద్రాబాద్‌లో పూర్ణిమ తండ్రికి ఓ ఫ్యాక్టరీ ఉంది. పూర్ణిమకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ సమయంలోనే తమ ఫ్యాక్టరీలో పనిచేసే కార్తీక్ ను విహవాం చేసుకొన్నట్టుగా పూర్ణిమ తల్లిదండ్రులకు పోటోలను చూపింది.
ఈ విషయమై తల్లిదండ్రులతో పూర్ణిమ గొడవకు దిగింది. ఈ విషయమై పోలీస్ కేసుల వరకు కూడ వెళ్లింది. ఈ విషయమై పూర్ణిమకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే తన ప్రియుడితోనే తాను ఉంటానని పూర్ణిమ పోలీసుల కౌన్సిలింగ్ లో చెప్పింది. దీంతో పూర్ణిమ సనత్ నగర్ లో కార్తీక్ తో కలిసి ఉంటుంది.
అయితే పూర్ణిమ, కార్తీక్ మధ్య మంగళవారం నాడు గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగానే పూర్ణిమ మృతి చెందిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ విషయమై కార్తీక్ పై చర్యలు తీసుకోవాలని పూర్ణిమ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.